శివా మాజిక్! అచ్యుతుని రాజ్యశ్రీ

 బడిలో ఎక్జిబిషన్ పెడుతున్నారు. అంతా సైన్స్ సోషల్ ప్రయోగాలు ఛార్ట్స్ తయారీ లో మునిగితే శివా అన్నాడు "సర్!నేను మాజిక్ చేస్తాను " అని రిహార్సల్స్ చూపాడు.ఓచిన్న మూతిఉన్న లోహంకూజాలోముందు కొంచెం పెద్ద సైజు బంతిని ఎలాగో సీసాలోకి దింపి నెట్టి లోపలికి ఓపురికొస కూడా దూర్చాడు.తన క్లాస్ పిల్లలను ఆతాడుతో సీసాని పైకి ఎత్తి గాలిలో ఆడించమన్నాడు.సీసాబరువుకి తాడు చేతిలోకి వచ్చింది. "నేను దీన్ని గాల్లో వేలాడదీస్తా" అంటూ ఏవేవో మంత్రాలు చదువుతూ కూజాని పైకి కిందకి తిప్పగానే బంతి దాని మూతిదగ్గర ఇరుక్కుంది.దానితో పాటే తాడు గట్టిగా బంతిని పట్టుకుంది.శివా తాడుపట్టుకు లాగగానే లోహంసీసా ఎంచక్కా గాలిలో వేలాడింది.
ఇకరెండో మాజిక్ ఇది.తన చేతివాచీని అరచేతిలో పెట్టి పైన దస్తీ కప్పాడు.ఇద్దరు ముగ్గురుని పిల్చి దస్తీ కింద  ఏముంది అని అడిగాడు. వారు తమచేత్తో దస్తీ ని తడిమి వాచీ ఉంది అన్నారు.ఈసారి తన ఫ్రెండ్ హరిని పిల్చాడు. హరి చాకచక్యంగా దస్తీ కింద నుంచి ఆవాచీని లాగేసి తన ప్యాంట్ జేబు లో వేసుకుంటాడు.మాటలతో బోల్తా కొట్టిస్తూ శివా తనచేతిని అటూఇటూ తిప్పి చేతిలోని దస్తీ తీయగానే వాచీ లేదు.అంతా చప్పట్లు కొట్టి అభినందించారు. ఇలా మంత్రతంత్ర మోసగాళ్ళు జనాల్ని మోసగించి డబ్బు గుంజుతారు🌷
కామెంట్‌లు