మిఠాయిలు ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
మిఠాయిలండీ మిఠాయిలు
లడ్డూలన్నీ గోళములు 
జిలేబిలన్నీ వలయములు
బర్ఫీలన్నీ చతురస్రములు
మైసూరుపాకులన్నీ
దీర్ఘచతురస్రములు
ఎన్నెన్నో ఆకారాలతో
తెలుపు ఎరుపు నారింజ 
నీలి, వంగ, గులాబీ 
పసుపుపచ్చ, ఆకుపచ్చ
ఎన్నెన్నో రంగులతో
ద్రవపదార్ధాలు ఘనపదార్థాలు 
గమ్మత్తైన సువాసనలతో 
నోరూరిస్తూ ఆకర్షిస్తూ
రారమ్మని పిలిచే 
మిఠాయిలండీ మిఠాయిలు !!


కామెంట్‌లు