గాడిద (బాలగేయం);--గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
గాడిదకు మరో పేరు
గార్ధభం అంటారు
గుర్రంలా ఉంటుంది
బరువులను మోస్తుంది

ఆయుర్వేద మందులకు
గాడిద పాలు వినియోగం
మనుషులను తిట్టుటకు
దాని పేరు ఊత పదం

గాడిదపై సామెతలు
ఉన్నాయి కోకొల్లలు
చెరసాలలో వసుదేవుడు
దాని శరణు జొచ్చాడు

గాడిదకు వెనుక ఉంటే
పొంచి ఉంది ప్రమాదం
దానికి దూరముంటే
ఎంతైనా ప్రమోదం
.

కామెంట్‌లు