-మనిషి మనిషిలా (చిత్రకవిత :)-- కోరాడ నరసింహా రావు
బతుకుబాటలో జీవనయాత్ర 
బరువు -  బాధ్యతల తో... 
తనకు ఎదురైన కష్టాల కంట కాలను సైతం తొలగించుకో  లేని పరిస్థితి.... !

సాటిమనిషి కష్టానికి కరిగే.. 
మనసున్న మనిషే సహకరించి 
మానవతను ప్రకటించగలిగేది 

మనదిపరస్పరసహకారజీవనం 
కనుకనే మనం పశువుల్లా..... 
 సమూహాలుగా కాక, మానవ సమాజాలుగా...అభివృద్ధిచెంది
సుఖముఆనందమయమైనజీవితాలనుగడపగలుగుతున్నాం   
 లోటులేని వ్యక్తిగత సుఖాను భవాలతో...కష్టం తెలియని భో  గాలతో...సహకారతత్వాన్ని మ రచిపోయి,బ్రతుకుతున్నసమాజానికి అప్పుడప్పుడూ... అక్క డక్కడా ఇలాంటి సంఘటనలు చిత్రాలుగుర్తుచేస్తూ,మానవత్వాన్ని  మేలుకొల్పితేనే... మనిషి తాను మనిషినని జ్ఞాపకం వచ్చి... మనిషులు  మనుషుల్లా బ్రతుకుతారేమో !
     ********

కామెంట్‌లు