పలుగు రాళ్లగుట్ట మీద
పరికి పండ్ల తీగ పొద
అందులోన దాగి యుండు
ఆటలాడె టామె రాద
చాటు నుండి చూసినాడు
దాగి దాగి వచ్చినాడు
ఓరగంట చూసుకుంటు
చిలిపి నవ్వు నవ్వినాడు
పొద చాటు కెళ్ళినాడు
మురళి నూది పాడి నాడు
గానము విన్న సూర్యుడు
మబ్బులోన దూరి నాడు
మబ్బు చూసి పక్షులన్ని
గూటిలోకి చేరుకొన్ని
కిలకిల రాగాలతో
ఎగురునచట పక్షులన్ని
సంధ్యా సమయమనుకుని
రాధ కనులు మూసుకుని
భక్తి తోడ మొక్కుతూ
మనసున తలుచు కృష్ణుని

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి