సునంద భాషితం ;-వురిమళ్ల సునంద ఖమ్మం
 కలితనము...కలికితనము
*******
కలితనముతో పనులను చక్కబెట్ఠుకోవడం, ఎదుటి వారి హృదయాలను ఆకట్టుకోవడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య.
కొందరి మాటల్లోని శౌర్యానికి, మనసులోని దండితననానికి, చేతల్లోని  ప్రావీణ్యతకు ముగ్ధులము కాకుండా ఉండలేం.మనసును,మనిషినీ ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు వారిలో పుష్కలంగా ఉంటాయి.
మరి కలితనమునకు ఏమేమి అర్థాలున్నాయో చూద్దాం...శౌర్యము,దండితనము, పౌరుషము,ప్రభవము,బింకము,వడి,వాడి, నేర్పు కౌశలము, చాతుర్యము, సామర్థ్యము  మొదలైన అర్థాలు ఉన్నాయి.
కలితనముతో నిప్పు లాంటి నిఖార్సయిన వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలి.
కానీ కలికితనము మాటలతో  ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు.అందరిలో  తక్కువ కావద్దు.దాష్టీకము చేయడం వల్ల  గౌరవం పోతుంది.ప్రగల్భత వలన పలుచనై పోతాం. కాబట్టి కలికితనమును తొలగించుకోవాలి.
కలికితనము అంటే ఎమిటో అర్థమై వుంటుంది. కలికితనము అంటే దిట్టతనము, దాష్టీకము,ప్రగల్భత,ప్రౌఢత,బటువు,వైయాత్యము అనే అర్థాలు ఉన్నాయి.
కాబట్టి కలికితనమును దరిదాపుల్లోకి రానీయొద్దు. కలితనమును మనసు నుండి వీడిపోనీయొద్దు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు