చిలుక_పలుకులు -- ఒక వీక్షణం .......!!-----కె.సుధాకర్ రెడ్డి--హన్మకొండ.
 నేనూ
విన్నాను..
కథకుడు స్వయానా దంతవైద్యులు అయినందువలననేమో.. చిలకపలుకులు
చిరంజీవి అన్షికి పాలపళ్లతో మొదలుపెట్టి
ఆ చిట్టి తల్లి బోసి నవ్వులను ఆస్వాదిస్తూ..
కరోనా మహమ్మారి  కలుగజేసిన ప్రత్యక్షనరకాన్ని ప్రస్తావిస్తూ...తన సమయమంతా ముద్దుల మనవరాలి తో గడుపుతూ..
కనీసం   బయటకు  అడుగుపెట్టలేని నరకయాతను ప్రస్తావిస్తూనే..
చిరంజీవి ఆన్షి ని బొమ్మలకే బొమ్మగా చిత్రీకరించారు
బాల్యం నుండే  మమ్మీ డాడీ ల సంప్రదాయం మొదలైంది అని ఆవేధనపడ్డట్టుగా అనిపించింది...
పడ్డారేమో.?

బీడువారిన పొలాలను  శిథిలమవుతున్న వాతావరణం అస్తవ్యస్థమైన జనజీవనం చూసి బాధను వ్యక్తపరిచారు.
విత్తన జీవితచక్రాన్ని విషధీకరిస్తూనే ప్రకృతి లోని అందాలను అశ్వాదించారు
అందాల బృందావనంలో విరుగబూసిన పూలన్నిటిని మనవరాలి తల్లో అలంకరించాలని
ఆశపడ్డ తాత గారి హృదయం..
తోటలోని చెట్లరకాలు అవి కాసే కాయలు పండ్ల గురించి వివరిస్తూనే వాటి బాగోగులు పట్టించుకోలేకపోతే అంతర్దానమైపోతాయని బాధపడ్డారు..
మహాత్మాగాంధీజీ చరిత్రను చాలా క్లుప్తంగా తేటతెల్లమ్ చేసేప్రయత్నం లో విజయం సాధించారు
 వాతావరణ సమతుల్యానికి,కాలుష్య నివారణకు ప్లాస్టిక్ నిర్మూలన బాధ్యతగా చేపట్టాలని   దీనికి ప్రజాలసహకారం ప్రభుత్వానికి అవసరమని హితవు చెప్పారు
ప్రపంచ మానవాళిని మట్టుపెట్టడానికి ఖరీదైన...పెద్ద పెద్ద అణ్వస్త్రాల అవసరం లేదు కంటికి కానరాని
సూక్ష్మతి సూక్ష్మమైన పురుగు చాలని ప్రపంచదేశాలు డాంబికత్వాన్ని మానుకుని పొరుగు దేశాలకు తోడ్పడాలని అభిప్రాయపడ్డారు..
పుట్టినరోజు పండగే అందరికి బాల్యంలో ఎంతో ఆనందపడే ఆ రోజు వృధ్యాప్యంలో గడచిన రోజులను
తీర్చుకున్న బాధ్యతలను గుర్తుకువస్తాయని అనుభవపూర్వకంగా చెప్పారు..
కోనసీమ కుర్రాడైన మన రచయిత అక్కడ విరివిగా దొరికే కొబ్బరికాయలు (బొండాలు) వాటి విశిష్ట ఉపయోగాల గురుంచి విషధీకరించారు
లిపిలేని కంటిబాషలకు అక్షరామాలలతో
ముడివేసి తోకలేని పిట్ట తొంభై అమడలు ప్రయాణం చేసి వార్తలు మోసుకొచ్చే ఉత్తరం గురించి చెబుతూనే పెరిగిన సాంకేతిక విజ్ఞానం లో అది కనుమరుగైన తీరును ప్రస్తావించారు.
ఆకాలవర్షాలు...సకాలంలో కురియని వర్షాలు
అయితే అధికవృష్టి లేకపోతే అనావృష్టి  వర్షాలతో తికమక మవుతున్న  దేశానికు వెన్నెముకయిన రైతన్న కడగన్డ్లను హృధ్యంగా ప్రస్తావించారు..
శీతాకాలం చలి పులి గురించి చెబుతూనే ప్రత్యమ్నాయాలనూ తెలిపారు..
 కొబ్బరిచెట్టూ. కాయా..పీచు..మట్ట.. వాటి ఉపయోగాలు వాటి విలువల గూర్చి భలేగా చెప్పారు..
విదేశాలకెళ్లిన సంతానం ను తలుస్తూ ఉప్పొంగిన తండ్రి మనస్సు అనుకున్నప్పుడు చూడలేమే  అనే బాధాతప్త హృదయం ఆనంద బాష్పాల తో మసకబారింది
కాళీ స్థలాలు లేని కాలనీలు పుట్టుకొచ్చిన తరుణం లో మన ఇంటి పైకప్పే పూలు..కూరగాయలు..ఆకుకూరలు ..కాయలు..పండించే క్షేత్రాలు కావాలని కాంక్షించారు
అన్ని రకాల వార్తలు మోసుకొచ్చే బాధ్యత పోస్టుమాన్ ది అయినను శుభవార్తలకోసమే ఎదురు చూసే బేల మనస్సు మనిషిది. ఎదురుచూడడం లోని ఆత్రుతను ఆర్ధ్రంగా ప్రకటించారు..
తెలుగు వర్ణమాల గొప్పతనం గురించి మనవరాలికి
తెలియజేసారు..
ఇక్కడ రచయిత కుటుంబం నేపథ్యం గురించి చెప్పుకుంటే...వీరిది రేడియో/రచయితల  కుటుంబం అని ఒప్పుకోవాల్సిందే!
ముందువచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములు గట్టివన్న నానుడిని తిరుగరాసి ముందు ఆవిర్భవించిన రేడియో సంగీతమే డాక్టర్ గారి మొదటి 
ప్రాముఖ్యత గా సేలవిచ్చారు..
 ఇష్టమని అధికంగా తింటే ఊబకాయమేనని ఉటంకిస్తూ..పాలు పళ్లరసాల ప్రాముఖ్యతను ప్రస్తావించారు..
చివరగా తను నమ్ముకున్న మతానికి నీరాజనాలర్పిస్తూ
క్రీస్తు జననం పొందిన డిసెంబర్ నెలను కీర్తించారు

 రచయిత..డాక్టర్ గారు ముచ్చటగొలిపే వంగపండు పాట బాణీ ని సైతం వదలకుండా తమ స్వగ్రామం అయిన దిండి కి "ఎల్దమోస్తవా "అని ఆహ్వానం పలికారు పాఠకులను.
రచయిత ..ప్రముఖ దంతవైద్యులైనట్టి
ఎల్ వి ప్రసాద్ కానేటి గారికి నమస్సులు
అభినందనలు
                          ***


కామెంట్‌లు