* కోరాడ నానీలు *
విపరీతముగా... 
  పెరిగిపోయిన ధరలు !
   బ్రతుకు భారమై... 
     సామాన్యులు... !!
.    *****
పండించేవారు... 
  వినియోగించేవారూ...         
...   ఏడుస్తుంటే.... 
  కొని - అమ్మేవారంతా ఖుషీ 
     ******
కటిక దారిద్య్రం.... 
   అక్రమాస్తులు.... 
   మన దేశ నాణానికి.... 
    బొమ్మా - బొరుసులు !
    ******
కంపుకొడుతోంది.... 
  అటు పాలకుల్లో... 
    ఇటు పాలితుల్లో....
      అవినీతి మురిగి  !!
     *****
మానవత్వానికి.... 
   మాయ రోగం.... !
   నివారనౌషధం.... 
    దొరికేదెక్కడ... ఎప్పుడు !?
      ******
...కోరాడ నరసింహా రావు !

కామెంట్‌లు