ప్రబోధ గీతిక; --గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు
కలతలను తరమాలి
కలవరం వీడాలి
కిలకిల నవ్వుతూ
కళకళలాడాలి

గురువులను కొలువాలి
తరువులను పెంచాలి
పరువుతో బ్రతుకుతూ
తెరువును చూపాలి

తగవులను ఆపాలి
పగలను మాన్పాలి
ప్రగతి బాట వేస్తూ
జగతిలో  సాగాలి

విలువతో  బ్రతకాలి
చెలిమితో నడవాలి
కలువలా అలరించి
గెలుపును పొందాలి


కామెంట్‌లు