మణిపూసలు; - సుమ కైకాల
1. ముద్దులొలికే పిల్లలు
    ఇంట వెలిగే దీపాలు
    మనసులో బాధనంతా
    తొలగించే చిరు మమతలు

2. బడికి వెళ్ళే పిల్లలం
    చిన్నారి బుడుగులం
    గురువులే మాకు రక్షణ
    అల్లరంటే మాకిష్టం

3. ఎగసి పడే తరంగాలు
    మదిలోని ఆలోచనలు
    ఆగమన్నా ఆగవెప్పుడు
    చైతన్య స్రవంతులు

4. సరళమైన కవితలు
    రస రమ్య రాగాలు
    శ్రావ్యమైన సoగీతము
    కలుగు ఆనందాలు

5. ఆటలలో మునుగుతాము
    పాటలలో తేలుతాము
    అందరితో కలుపుగోలుగా 
    క్రమశిక్షణతో ఉంటాము

కామెంట్‌లు