సవరణ;-- జగదీశ్ యామిజాల
 కుమారస్వామి అనే ఆయన మరణించారు. అయితే ఓ పత్రిక పొరపాటున గురుస్వామి మరణించారని ప్రచురించింది.
అది చూసి గురుస్వామి మండిపోయారు. ఉగ్రరూపంతో ఆ పత్రిక కార్యాలయానికి వెళ్ళారు. 
"నేను బతికే ఉంటే మరణించినట్టు ఎలా ప్రచురిం"చారని గొడవపెట్టుకున్నాడు.
తనకు అవమానం జరిగిందని గగ్గోలు పెట్టాడు. 
"క్షమించండి. పొరపాటైపోయింది. మరణించిన వారి పేరు మారిపోయినందుకు బాధపడతున్నాం. ఈసారికి దయయుంచి క్షమించండి. మీరు మరణించలేదని, బతికే ఉన్నారని, మీరు మరణించినట్టు ఈరోజు వచ్చిన వార్తను ఖండిస్తూ ఓ సవరణను రేపు మరొక వార్తగా వేస్తామండి" అన్నారు పత్రికవారు.
అయినా గురుస్వామి కోపం తగ్గలేదు.
"సవరణ వేస్తే చాలదు. చింతిస్తున్నాం ఆనే మాట ఉండాలి ఆ సవరణలో " అన్నాడు గురుస్వామి.
"అలాగే" ఆన్నారు పత్రిక వారు.
మరుసటిరోజు "సవరణ" విషయం వెలువడిందిలా......
"మరణించిన వారి పేరు కుమారస్వామి. కానీ గురుస్వామి అని పొరపాటున తప్పురాశాం. గురుస్వామి బతికే ఉన్నారనే విషయాన్ని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని ప్రచురించారు ఫోటోతోసహా.

కామెంట్‌లు