నేరము -శిక్ష ;-చంద్రకళ యలమర్తి
 "నాన్నోయ్,  మన ఇంటి దగ్గర చెరువు ఎప్పుడూ  ఎండిపోయి ఉంటుంది కదా.'
"అవునురా."
" ఈరోజేంటి మన ఇల్లు చెరువై పోయింది."
"వాన వొచ్చింది కదరా, వీధిలోని కంపునీళ్ళన్నీ ఇంట్లో కొచ్చే
సాయి ." 
"వాన వచ్చింది, వెళ్ళింది కూడా."
"మరే వెళ్ళింది కదా."
"బయట వాన ఆగిపోయింది. కానీ నాన్నా, ఇంట్లో ఇంకా పడుతోంది. తడిచిపోతున్నావు . ఇందా గొడు
గేసుకో."
"మంచాలు, కుంచాలు తడిసిపో
యాయి. రాత్రికి ఎలా, ఎక్కడ పడుకుందాము"?
"నిజమేరోయ్  రాత్రికి కూచొనే నిద్రపోవాలి. ఇల్లు కురుస్తోంది. గొడు గేసుకునే ఉండాలి. చచ్చే చావు వచ్చిందిరోయ్."
"అమ్మ,ఎన్ని సార్లు రిపేర్లు చేయిం
చమనిచెప్పింది. నువ్వు వింటేగా."
"నాజీతం అంతా నీకు, అక్కకి ఫీజులకే సరిపోతోంది ఇంకేం చేయి స్తాను."
"అయ్యో అవునా నాన్నా, నేను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి మంచి ఇల్లు కొంటాలే."
"మానాయనే చల్లని మాట చెప్పావు."
"మరి ఇప్పుడు ఆకలి దంచేస్తోంది. ఏం చేద్దాం నాన్నా?"
"ఈ నీళ్ళల్లో ఎలా వండనురా ?"
"అమ్మ, అక్క ఊరెళ్ళారు. వంట రాని వాళ్ళం ఏం తింటాం?, ఈ నీళ్ళల్లో ఏం వండుకుంటాం?"
"బయటనుండి తెచ్చుకుందాము."
"మొత్తం మునిగి పోయింది. ఎట్లా వెళ్తారా "?
"నాన్నా, జొమాటో లో తెప్పించు
కుందాం."
"ఈ నీళ్ళల్లోఈదుతూ ఎవరొ
స్తారు, ఏం తెస్తారు?
 "తెల్లారాక కూడా నీళ్ళు ఇలాగే  వుంటే ఎవరయినా దయతలచి ఇంతన్నం పెడితే తినాలి."
"అయితే, ఈ రాత్రికి ఉపవాసం, జాగారం, తప్పదు.శివరాత్రి అనుకోవాలేమో నాన్నోయ్."
"అంతే నంటావా"?
"ఇంకేం చేస్తాము "?
"చెట్లు కొట్టేసి, చెరువులు పూడ్చేసి
ఇళ్ళు కట్టేస్తే ఇంతే మరి. మనం చేసిన నేరాలకి మనమే శిక్షఅనుభ
వించాలి."
"అంతేరా, ఇల్లు మునిగితే కానీ చేసిన తప్పు తెలియలేదు."
***


కామెంట్‌లు