:"చిత్రం"--(:" హైకూలు" );-నలిగల రాధికా రత్న.
1) జాజి మల్లెలు 
     ముదిమి వసంతంలో 
     ప్రేమ సరాగం.

2) అనునయంగా 
     ఒకరికి ఒకరు 
     తాళి మహత్యం.

3) ఆయన స్పర్శ 
     అర్ధాంగి దరహాసం 
     మల్లె మెరుపు.

4) పతి మురిపెం
     వాడబారని సుమం 
     సతి జడలో.

5) వీడని ప్రేమ 
     మమతకు సాక్ష్యంగా 
     మలి సంధ్యన.


కామెంట్‌లు