నన్ను నేను వదులుకొని!!?; - ప్రతాప్ కౌటిళ్యా
నేను
ఆమె వెంట పడుతున్నప్పుడు
నా కళ్ళు
పక్షులై వెనక్కి ఎగిరిపోతున్నాయి!!

నేను
ఆమె గురించి ఆలోచిస్తున్నప్పుడు
నా మనసు
మేఘమై వెనక్కి వెళ్ళిపోతున్నది!!?

నేను
ఆమెను ప్రేమిస్తున్నప్పుడు
నా అవయవాలు
శరీరంలో నక్షత్రాలై రాలిపోతున్నాయి!!?

నేను
ఆమె వెంట నడుస్తున్నప్పుడు
నా కాళ్లు చేతులు
సుడిగాలికి వెనక్కి కొట్టుకుపోతున్నవీ!!?

అందుకే
నన్ను నేను వదులుకొని
ఆమె కోసం ముందుకు కదలాలి
నమ్మకంతో!!?

ఒక వసంతానికి ముందు
ఆకులు రాలిపోయినట్లు

ఒక ఉదయానికి ముందు
సూర్యాస్తమమైనట్లు

ఒక పూర్ణిమ కు ముందు
అమావాస్య వచ్చినట్లు!!

నమ్మకంతో
ఆమె కోసం
నన్ను నేను వదులుకొని
ముందుకు కదలాలి!!?

మంచు కరిగినట్లు
దీపం వెలిగినట్లు
సహజంగా

చీకట్లను
ఎండమావులను
ఎదిరించి

కొవ్వొత్తిలా కరిగిపోతూ
గాలిలా కనిపించకుండా
నమ్మకంతో

నన్ను నేను వదులుకొని
ఆమె కోసం
ముందుకు నడవాలి!!?

Pratap koutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు