మనిషై పుట్టాలని....మీసాల సుధాకర్.--పి.జి.టి-తెలుగు.--ఖిలాషాపురం, జనగామ జిల్లా.
ప్రతి నిత్యం మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్నా,చూస్తున్నా  విషయాలపై నవరత్నాల వంటి తొమ్మిది
వాక్యాలతో రాసిన  పుస్తకం"మనిషై పుట్టాలని".ఇందులో 42 కవితలున్నాయి.దీనిని రచించినది శ్రీ పానుగంటి రామమూర్తి గారు(ఖిలాషాపురం, జనగామ జిల్లా).
ఇందులోని ప్రతి కవిత ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.సున్నిత హృదయులైన కవులు మాత్రమే వారు అనుభూతి చెందిన విషయాలను అక్షరీకరిస్తారు.యాంత్రిక జీవితాన్ని గడుపుతున్న ఆధునిక మానవుడు తనను తాను మరొకసారి తడిమి చూసుకునే అవసరాన్ని ఇందులోని కవితలు తెలియజేస్తాయి.

బాల్యం

బహుదూరపు బాటసారి
మొట్టమొదటి మజిలీ!
కల్లాకపటం తెలియని నవ్వుల
ప్రపంచం
కాంట్ వెలుగుతో
ఇంటి వెలుగై మెరిసే బాల్యం
మధుర జ్ఞాపకమై
నిలిచిపోయే వాస్తవ స్వప్నం!
ప్రకృతి విన్యాసాల ప్రహేళిక!

నాన్న

అవిశ్రాంత మార్గదర్శి!
ఆశయం భుజాన వేసుకున్న
నిన్నటి కొడుకు!నేటి నాన్న!
అనంత సాగర మథనం ఆయన సంసారం
రవంత ఆనందాన్ని ఇల్లంతా పరిచే
నిత్య కృషీవలుడు,ఆశాజీవి
సంతానం పురోగతి కోసమే గదా!
ప్రేమను దయనూ కంటివెనుక దాచుకొని
కృత్రిమ ఉగ్రత్వం చూపే నటుడు.

కామెంట్‌లు