Dr. పరంధామన్ , PHD!!;-- యామిజాల జగదీశ్
 నిన్నొక మిత్రుడు ఓ రైల్వే స్టేషనుకి టాక్సీ బుక్ చేసుకున్నాడు. 
స్టేషన్లో దిగగానే టాక్సీ డ్రైవర్ తన బిజినెస్ కార్డు ఇచ్చాడు. 
"సార్, ఏదన్నా సవారీ అయితే నన్ను పిలవండి సార్" అన్నాడతను.
అతనిచ్చిన కార్డ్ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతో ఆశ్చర్యపోయాడు మిత్రుడు. విస్తుపోయాడుకూడా. ఎందుకంటే అందులో Dr. పరంధామన్ , PHD అని ఉంది.
ఇతను డాక్టరేమిటీ ? PHD ఏమిటీ ? అని తెలుసుకోవాలనిపించింది మిత్రుడికి. 
ఎంత ఆలోచించినా ఏమీ తట్టకపోవడంతో మిత్రుడు అతనినే అడిగాడు..."మీరు డాక్టరా?" అని.
అప్పుడా మనిషి ఇలా చెప్పాడు...
"సార్,  Dr అంటే డ్రైవర్ ( Driver) అని. డ్రైవర్ అనే మాటను నేనలా Dr. అని కుదించానండి.  PHD అంటే Private Hired Driver" అని!!

కామెంట్‌లు