వాడవాడలా విద్యుత్తు;-రచన : ఆకెళ్ళ మార్కండేయ శర్మ;-సమీక్ష : Dr కందేపి రాణీ ప్రసాద్

 అరవై పేజీల ఈ చిన్న పుస్తకాన్ని ఆకెళ్ళ మార్కండేయ శర్మ గారు 1967 లో రచించారు. ఈ పుస్తకం ఆధునిక విజ్ఞాన గ్రంథమాల కాకినాడ వారిచే ప్రచురించబడింది. భారత ప్రభుత్వ విద్యాశాఖ వారు నిర్వహించిన తొమ్మిదవ పోటిలో బహుమతి పొందిన గ్రంధం. మనదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత పంచవర్ష ప్రణాళికల వలన దేశాన్ని అభివృద్ధి పరచే మార్గంలో ఒక గ్రామంలో విద్యుచ్చక్తిని సరఫరా చేస్తారు. నూనె వత్తిలేకుండా దీపాలు ఎలా వెలుగుతున్నాయన్నది వారి మదిలో మెదిలే సందేహం. ఆ గ్రామంలో ఉన్న సుశీల అనే ఆమె తన తండ్రికి మాకు విద్యుచ్చక్తి వచ్చింది కాబట్టి ఎన్నో సౌకర్యాలు పొందుతున్నాం. కానీ దీన్ని ఎలా తయారుచేస్తారు? దేనిగుండా అన్ని ఉళ్ళకూ పంపిస్తారు? విద్యుద్దీపాలు, పంకాలు, రేడియో, నీళ్ళమోటారు ఏ విధంగా పని చేస్తున్నాయి? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియవు. కావున నాన్నా మీరు శాస్త్రంశాలు భోధించే అచార్యులు కాబట్టి ఈ విషయాలను తెలియజేయండి అంటూ ఉత్తరం రాస్తుంది. దానికి ఆమె తండ్రి మధుసూదన్ ‘ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు?’ అనే ఐదు ఉత్తరాల ద్వారా విద్యుచ్చక్తి గురించి కూలంకషంగా తెలియజేస్తారు. పుస్తకం చివర విద్యుత్తును కానీ పెట్టిన మైఖేల్ ఫారడే ఫోటోను, అవసరమైన చోట్ల మరికొన్ని ఫోటోలు ఇవ్వడం ద్వారా పుస్తకం చదివినవారికీ విషయాలు చక్కగా అర్థమవుతాయి.
కామెంట్‌లు