ఆకాశదీప వైశిష్ఠ్యం;-" రసస్రవంతి " & " కావ్యసుధ "kavyasudha4@gmail. com-9247313488 : హైదరాబాదు
 కార్తిక మాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. ఆకాశదీపాలును వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. ఈ దీపాన్ని దేవాలయంలో వెలిగిస్తారు. దేవాల యంలో ధ్వజస్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నిధనం కాకుండా రంధ్రాలతో ఏర్పాటు చేసి జాగ్రత్తగా భగ వంతుని నామాలు చెబుతూ భక్తులంతా చుట్టూ నిలబడి ఉండగా ఆ దీపాన్ని పైకి ఎత్తుతారు. ఎవరి శక్తి కొలదీ వారికి తగినట్లుగా వారు  ఆకాశదీపానికి చమురు, ఒత్తులు ఇస్తారు. దీపం పైనే ఎందుకు?
దీపం ద్వజస్తంభం మీద ఉండి అంతటా వెలుగు చిమ్ముతుంది. ద్వజస్తంభం మీదికి ఏదైనా లాగితే, పతాకాన్ని ఆరోహణ చేస్తే ఈశ్వరుని ఉత్సవం జరుగుతోందని అనడానికి గుర్తు. ఉత్సవంలో ఉత్ అంటే తలపైకెత్తడం. తలపైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. దాని అర్ధం ఏమిటంటే సమస్త భూతాలకు నేను ఉపకారం చెయ్యగలను అని. ఇతర ప్రాణులు దీపాలను వెలిగించలేవు. నేను ఆపని చెయ్యగలను అనే భావన.
ఈనాడు విశేషంగా గుత్తిదీపాలను వెలిగిస్తారు. నిజానికి ఈరోజు చెత్తకూడా వెలిగించాలి. వీధుల్లో ఉన్న చెత్తను కూడా వెలిగించమని శాస్త్రాల్లో ఉంది. ముందు మీ ఇంట్లో దీపం వెలిగించి కార్తిక పౌర్ణమి నాటి ప్రదోషకాలంలో దామోదరమావాహయామి అని గాని, త్రయంబకమావాహయామి అని గాని ఆదీపాన్ని వెలిగించాలి. దీపం పెట్టి ఆకాశం వంక ఒక్కసారి చూసిన తరువాత దీపానికి నమస్కారం పెట్టాలి. 🪔


కామెంట్‌లు