"శివోహం ";-చంద్రకళ. Y
"ఓం నమశ్శివాయ.. శివుని నామం!
పంచాక్షరి మంత్రోచ్చారణ నలు
దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి!"

"కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 
భక్తుల భజనలు, ప్రార్ధనలు!
జయజయ ధ్వానాలు,ఆప్రాంగణ మంతామారు మోగుతోంది!"

"పవిత్ర కార్తీక మాసములో,
పావన గంగా నదీతీరంలో
 కైలాసాన్ని తలపిస్తోంది వారణాసి క్షేత్రం!"

"పాలతోనయినా స్వచ్ఛమైయిన జలంతో నయినా అభిషేకిస్తే చాలు! 
తనివితీరా ప్రార్ధిస్తే ప్రత్యక్షమౌ
తాడు!"

"మనసారా కొలిచితే, కోరికలు తీరుస్తాడు!
భక్త సులభుడు, శివయ్య భోళా శంకరుడు!"

"అతడినే నమ్మితే, సర్వం త్యజిస్తే 
 జన్మ రాహిత్యమే వరంగా  ఇస్తాడు ఆ శివయ్య!"

"ఎటు చూసినా తెలుగు వారే
అంతటా తెలుగు వినబడుతోంది!
ఆంధ్ర దేశంలో నే కాశీ వున్నదన్న భ్రమ నాలో!"

"ఆ శివయ్య మనవాడే అని
పించాడు!
ఆ గంగమ్మా మనఅమ్మే అనిపిం
చింది!"

"నాది,మనది అనుకుంటే ఎంత ఆనందం!
 గుండెల నిండా భక్తి పారవశ్యం!"
 
"శివోహం, శివోహం, శివోహం, అంటే
నేనే శివుడు, శివుడే నేను అనేగా అర్ధం!"

"ఎక్కడో వెతుకుతావు, కలత పడతావు!
తెలుసుకో మనసా మనలోనే కొలువున్నాడు శివుడు!"

"ఊపిరి ఉన్నంత సేపు ఈ శరీరం శివమే
ఊపిరి ఆగితే ఈ శరీరం ఇక శవమే!"

***కామెంట్‌లు