*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 006*
 కందం:
*తనపైదయ నుల్కొనఁగను*
*గొన నేతెంచినను శీల గురుమతులను పం*
*దనముగఁ భజింపందగు*
*మనమలరగ నిదియ విబుధ మతము కుమారా !*
తా:
కుమారా! నీమీద ప్రేమతో, దయతో నిన్ను చూటకు వచ్చిన మంచి గుణము, బుద్ధి కల వారిని చూచి నమస్కారాలు చేసి, తగిన పద్దతిలో వారికి మర్యాదలు చేసి వాళ్ళను సంతోష పెట్టడము బుద్దిమంతులు అయిన వారు ఆచరించ వలసిన విధానము.... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఎంతమందిని అయినా మనం అభిమానించ వచ్చు, ప్రేమించ వచ్చు. కానీ, వారందరూ మనల్ని అభిమానించి, మనతో ప్రేమగా ఉండాలి అనేది నిజం కాదు. మన మీద, మనం ప్రేమిస్తున్నాము అనుకునే వారికి అభిమానము, ప్రేమ ఉండ వచ్చు, ఉండకపోనూ వచ్చు. అందుకనే, మనల్ని కావాలి అనుకుని, మనం మంచిగా, సంతోషంగా, ఆరోగ్యంతో ఉంటే చూసి సంతోషించే వారు దొరికినప్పుడు, వారిని మనవారిగా చేసుకోవడం ఉత్తమమైన లక్షణం.  వారికి మన మనసులో, జీవిత గమనంలో సముచిత స్థానం ఇవ్వడం మన కనీస ధర్మం. ఎందుకంటే, అలా మన కోసం తపన, తాపత్రయమూ పడేవారు, మన నుండి డబ్బులు, వస్తవులు కోరుకోరు.  మనం మంచిగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. అటువంటి మంచి వారిని గుర్తించ గలిగే మంచి మనసు, వారిని గౌరవించుకో గలిగే సంస్కారం మనకు ఇవ్వమని.... అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు