*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 008*
 కందం:
*పెద్దలు విచ్చేసినచో*
*బద్ధకముననైన దుష్ట పద్ధతి నైనన్*
*హద్దెరిగి లేవకున్నన్*
*మొద్దువలెను జూతు రతని ముద్దు కుమారా !*
తా:
కుమారా! పెద్దవారు మన దగ్గరగా వచ్చినప్పుడు, సోమరితనం లేక బద్దకము వల్ల కానీ, చెడ

అలవాట్ల వల్ల కానీ, మన హద్దులు తెలుసుకుని లేచి నిలబడకపోతే నిన్ను మూర్ఖుని గానూ, తెలివి లేని వాని గానూ చూస్తారు.... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*రాముడంతటి వాడు తానే పరమాత్మ అయినా కూడా, తనకు విద్య నేర్పిన గురువు, తన వెంట రమ్మనమని పిలిచిన విశ్వామిత్రుడు కనబడ గానే మర్యాద పూర్వకంగా లేచి నిలబడి నమస్కారాలు చేసాడు. కృష్ణ పరమాత్మ కూడా, దృతరాష్టృనికి, భీష్ముడు మొదలైన పెద్దలు అందరికీ కనబడిన ప్రతీ సారీ వినయంగా నమస్కారాలు చేసాడు. రామడు, కృష్టుడు కంటే మనమేమీ పెద్దలము కాదు కదా! వీరిద్దరూ పరమాత్మ స్వరూపాలు. అయినా మానవులమైన మనకు తెలియజేయడానికి వారు పెద్దల యెడ గౌరవంగా ప్రవర్తించారు. పెద్దలకు ఇవ్వ వలసిన గౌరవం ఇవ్వకుండా ప్రవర్తిస్తే ఏలా వుంటుంది అనడానికి శిశుపాలుడు చక్కని ఉదాహరణ మనకు. పెద్లల పట్ల అగౌరవంగా నడుచుకున్న వారు ఎవరూ బాగుపడిన దాఖలాలు లేవు. కనుక, మనమందరం మనకన్నా పెద్ద వారికి తగు మర్యాద ఇచ్చి నడచుకునే విధంగా ఆ పరమాత్ముని చల్లని చూపు కోరుకుంటూ......... అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు