కందం:
*పనులెన్ని కలిగి యున్నను*
*దినదినమున విద్యపెంపుధీయుక్తుడవై*
*వినగోరము సత్కథలను;*
*కని విబుధులు సంతసించు గతినిఁ గుమారా !*
తా:
కుమారా! ప్రతి రోజూ మీరు ఎన్నో పనులలో తల మునకలుగా ఉన్నా, చదువు మీద గౌరవ భావం ఉంచుకుని, మంచి మంచి నీతులు అందించే కథలను వినే మంచి అలవాటు చేసుకోవాలి. అలా మంచి కథలను విని పాటించే అలవాటు ఉన్నవాళ్ళను చూచి సమాజంలో ఉన్న బుద్ధిమమతులైన వారు సంతోషించి మెచ్చుకుంటారు....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ప్రహ్లాద కుమారుడు, మార్కండేయుడు చిన్నతనం లో కూడా హరి కథలను ప్రతిక్షణము వినడం వలన వారికి మనసులు పరమాత్ముని తో అనుసంధానం అయ్యాయి. అందువల్ల, వారి జీవిత గమానం మోక్షము వైపు నడచింది, చిన్నతనం నుండే. ఆ కథల వినికిడి ఫలితంగా, వారి తల్లితండ్రులకు, వారు పుట్టిన కులానికి, సమాజానికి, చిరస్థాయిగా నిలిచే మంచి పేరు వచ్చింది. ఆఖరికి పరమాత్మ సన్నిధికి చేరాడు, ప్రహ్లాద కుమారుడు, మార్కండేయుడు. ధృవతారగా మారి, మానవులు అందరికీ మార్గదర్శి అయ్యాడు, ధృవకుమారుడు. అందువల్ల, ఇప్పుడు మనం మన తరువాతి తరానికి మంచి కథలను వినిపించే బాధ్యత తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది, ఈ నాటి సమాజంలో. చందమామ కథలు, పంచతంత్ర కథలు మళ్ళీ ప్రచారం లోకి తీసుకు రావాలి. ఆ సామర్థ్యాన్ని మనకు పరమాత్మ ఇవ్వాలని ప్రార్థిస్తూ, ఇస్తాడని ఆశిస్తూ........... అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి