*"మాసానామ్ అస్మి మార్గశీర్షోహమ్" అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధించిన ఈ మార్గశీర్ష మాసంలో, పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*శివుని ఆరాధనలో పార్వతి దుష్కరమైన తపస్సు.*
*నారదా! కాళి అయిన పార్వతి నారద మహర్షి ద్వారా తనకు, తన ఇలవేల్పును పొందడానికి అవసరమైన మంత్ర రాజము "శివ పంచాక్షరీ" లభించింది అనే ఆనందం పంచుకోవడానికి తన తల్లి మేనక వద్దకు ఉరుకులు పరుగులతో చేరుకుని విషయం వివరించి చెప్పింది. పార్వతి వెంట ఆమె చెలులు జయా, విజయలు కూడా ఉన్నారు. తన స్వామిని పొందటానికి నిశ్చలమైన తపస్సు మాత్రమే మార్గము అని తెలుసుకున్న పార్వతి, తపస్సు చేసుకోవడానికి తన తల్లిదండ్రులను అనుమతి అడుగుతుంది. ఇంట్లోనే తమ కన్నుల ఎదుట ఉంటూ తపస్సు చెసుకోమన్నారు, తల్లిదండ్రులు. ఇల్లు విడచి వెళ్ళ వద్దమ్మా అని చెపుతూ, "ఉ" "మా" అన్నారు. అది మొదలు, కాళి, "ఉమ" గా పిలువబడింది. ఇంట్లో ఉండి తపస్సు చేసుకోవడం కుదిరే పని కాదని చాలా బాధ పడింది, కాళి. కూతురు మనసు తెలుసుకున్న మేనక, తపస్సు కు అనుమతి ఇచ్చింది. ఉమ అయిన పార్వతి, చీనీ చీనాంబరాలు, వజ్రవైఢూర్యాలు పొదిగిన నగలు, పట్టుపరుపుల సుఖం అన్నీ విడిచిపెట్టి, నేత చీరలు, పులి చర్మము ధరించి ఇష్ట సఖిలు తోడురాగా, గంగోత్తరీ తీరము వైపు తపస్సు చేసుకోవడానికి వెళ్ళింది.*
*కామదేవుడు దహింపబడిన గంగావతారము పర్వతశిఖరం దగ్గర లో ఉన్న శృంగి తీర్ధ శిఖరము చేరింది, పార్వతి. అక్కడ భూమిని శుభ్రం చేసి వేదిక ఏర్పరచుకొని, వేదిక దగ్గరగా అనేక ఫల పుష్పాలను ఇచ్చే చెట్లను నాటింది. గౌరి తపము చేసిన కారణంగా ఆ స్థలము, "గౌరీశిఖరమ"ని పేరు పొందింది. తన అన్ని అంగములను అధీనము లోకి తెచ్చుకుని, ఏకచిత్తముతో శివపంచాక్షరీ మంత్రము జపించసాగింది. ఎండాకాలములో తన చుట్టూ అగ్ని కుండములు ఉంచుకుని, వర్షాకాలములో వర్షములో తడుస్తూ, చలికాలంలో ఏమీ ఆహారం తీసుకోకుండా, మంచురాళ్ళపై కూర్చుని, చల్లని నీటిలో నిలబడి, నిరంతరం తదేక చిత్తంతో మంత్ర రాజాన్ని వదలకుండా జపం చేస్తూ ఉండేది, ఉమ. కొంత సమయం తన చెలికత్తెలతో కలిసి, తాను నాటిన చెట్లకు నీరు పెట్టేది, తన చుట్టూ ఉన్న పలు జంతువులకు ఆహారం అందించి సేవ చేసేది, ఉమ. ప్రతీ రోజూ తాను ఉన్న చోటునుండి వెళ్ళే అతిధులకు, అతిధి సత్కారాలు కూడా చేసేది, ఉమ.*
*మనసులో, ఆలోచనలలో శంభుని నిలుపున్న కాళి, ఏకాగ్ర చిత్తముతో, ప్రచండమగు తుఫానులను, ఎముకలు కొరికే చలిని, వర్షాలను, ఎండలను లెక్కచేయకుండా, తన మనో విభుని కోసం చేసే తపస్సు కొనసాగించింది. కేవలము శివునిలో మనసు లగ్నము చేసి, గౌరీ శిఖరము మీద నిలుచుని, కూర్చుని తపస్సు కొనసాగిస్తోంది, ఉమ.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి