*"మాసానామ్ అస్మి మార్గశీర్షోహమ్" అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధించిన ఈ మార్గశీర్ష మాసంలో, పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ సకల శుభాలు, పరమాత్మ తో దగ్గర తనం కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*శివుడు బ్రాహ్మణ రూపంలో పార్వతిని కలవడం - ఆమెతో తపస్సు కారణం అడగటం - వుజయ, పార్వతి సఖి అంతా వువరించుట*
*నారదా! సప్త ఋషులు ఇచ్చిన సమాచారం విన్న తరువాత రుద్రుడు పార్వతి తపోనిష్ఠను పరీక్షించే నెపముతో సతీదేవి ని చూడాలనుకున్నారు. ఎంతో తేజస్సుతో వెలుగిపోతున్న వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించారు. చెతులలో దండము, కమండలము, ఛత్రము పట్టుకుని, పార్వతి తపస్సు చేస్తున్న శృంగ తీర్థానికి వెళ్ళారు. అక్కడ తన సఖియల మధ్య దీర్ఘ తపస్సు లో మునిగి ఉన్న పార్వతిని చూసి మనసులోనే చాలా ఆనందాన్ని అనుభవించారు, రుద్రుడు. చంద్రకళ లాగా వెలుగిపోతున్న పార్వతి దగ్గరకు భక్తవత్సలుడు అయిన శంభుడు ప్రేమ ఆదరములతో వెళ్ళారు. అలా తన ముందుకు వచ్చిన వృద్ధ బ్రాహ్మణుని చూచిన పార్వతి, చెలికత్తెలను ఎదురుపంపి, ఆహ్వానము చేసి, "స్వామీ, వింతకాంతితో మెరసి పోతూ బ్రాహ్మణ రూపంలో వచ్చిన మీరు ఎవరు. బ్రాహ్మణ శ్రేష్టునిలాగా కనిపిస్తున్నారు. మీ తేజస్సుతో ఈ వనమంతా ప్రకాశవంతం అయ్యంది." అని కుశల ప్రశ్నలు వేసింది.
*"నేను స్వేచ్ఛా విహారం చేసే బ్రాహ్మణుడను. ఇతరులకు మేలు చేసే బుద్ధి కలవాడిని. తపస్విని, పరోపకారిని, సుఖప్రదుడను. అమ్మాయి! నీవు ఎవరవు. ఈ నిర్జన ప్రదేశంలో, నీ భర్త తోడు లేకుండా ఒక్కతవే ఏమి చేస్తన్నావు. నీవు బాలికవు కావు. వృద్ధురాలివి కావు. నీవు ఏ కులములో, ఎవరికి జన్మించావు. నీవు చేస్తున్న తపస్సు వృధా అవుతుంది. నీవు వేదమాత గాయత్రి వా, సరస్వతి వా, లక్ష్మి వా? నేను పోల్చుకో లేక పోతున్నాను. ఎవరు నీవు" అని అడిగారు.*
*దానికి పార్వతి, నేను గిరిరాజ కూతురిని. ఇప్పుడు నా పేరు, కాళి, పార్వతి. ఇంతకు ముందు జన్మలో నేను దక్షుని కుమార్తెను. అప్పుడు నా పేరు సతి. ఆ జన్మలో నా భర్త అయిన శంభునికి అవమానం జరగడం వల్ల నేను నా ఇచ్ఛా శక్తి తో అగ్ని ప్రజ్వలన చేసి నా శరీరం చాలించాను. ఈ జన్మలో ఇప్పటికి మూడు వేల సంవత్సరాలు తపస్సు చేసాను. చంద్రశఖరుడు ప్రత్యక్షమై కాముని దహించి వేసి మళ్ళీ తన కైలాసానికి వెళ్ళి పోయారు. కనుక నా స్వామిని పొందాలని తపము చేస్తున్నాను" అని చెప్పింది.*
*"ఇంత కఠోర తపము తరువాత కూడా నా స్వామి శంకరునికి నా మీద దయ కలుగలేదు. అగ్ని ప్రవేశం చేయాలి అనుకున్న సమయంలో మీరు వచ్చారు. అందువల్ల నేను ఒక్క క్షణం అగాను. మీరు బయలయ దేరితే, నేను అగ్ని ప్రవేశం చేసి నా శరీరం చాలిస్తాను. ఎన్ని జన్మలైనా, ఆ స్వామిని భర్తగా పొందడానికి వేచి ఉంటాను, శంకరుడే నా పతి. ఇది నిశ్చయము " అని వృద్ధ బ్రాహ్మణునితో పార్వతి చెప్పింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి