*"మాసానామ్ అస్మి మార్గశీర్షోహమ్" అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధించిన ఈ మార్గశీర్ష మాసంలో, పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ సకల శుభాలు, పరమాత్మ తో దగ్గర తనం కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*విప్రుడు గా వచ్చి రుద్రుడు, శంభుని నిందించుడ - అతనిపై నుండి మనసును మరల్చుకొమని పార్వతికి చెప్పడం*
*నారదా! బ్రాహ్మణుడు గా వచ్చిన, జటలు ధరించి ఉన్న విప్రదేవునితో పార్వతి "బ్రాహ్మణోత్తమా! విప్రవరా! నా సఖి విజయ మీతో చెప్పినది అంతా ముమ్మాటికీ సత్యమే. పరమశివుని భర్తగా పొందాలి అనే కోరిక నాకు నా చిన్నతనము నుండి ఉన్నది. ఈ రోజు కలిగినది కాదు. మీరు మనసు మార్చుకో అని చెప్పగానే, శివుని మరచి పోవడం అసంభవము, అసాధ్యం. శంకరుని భర్తగా పొందడం అంత సులువైన విషయం కాదు అని నాకు కూడా తెలుసు. అందువల్ల నే, మూడు వేల సంవత్సరాలుగా కఠోరమైన తపము చేస్తున్నాను, ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి." అని చెప్పి మౌనంగా ఉండిపోయింది. "శివుని నుండి మనసు మరల్చుకోమని ఎన్నిసార్లు ఎంత చెప్పినా నీవు వినడం లేదు" ఇక నేను నాదారిన పోతాను అని బ్రాహ్మణుడు కదలబోయాడు. "మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు. నాకు మంచి చేసే మాటలను చెప్పండి. నా కోరిక తీరే దారి చూపండి అని అడుగుతుంది.*
*తన ఊతకర్ర చేతిలోకి తీసుకుని వెళ్లడానికి సిద్ధమైన విప్రుడు పార్వతి తనని ఆగమని చె్పిన మాటలు విని, " ఓ ఉత్తమురాలా! నా మాటలు విను. నేను నీకు సత్యమునే చెపుతాను. శంభుని ఎడల నీకు అనురాగము ఉంది అని నాకు తెలిసింది. కానీ, ఆ శంభుడు, ఎద్దు గుర్తును తన జెండాలో ఉంచుకున్నాడు. తల మీద ఎప్పుడూ జటలు కట్టిన వెంట్రుకలు ఉంటాయి. ఒంటినిండా విబూది పూసుకుంటాడు. వికృతంగా కనిపించే మూడు కళ్ళు ఉంటాయి. బట్టలకి బదులు పులిచర్మము కట్టుకుంటాడు. మెడలో అందమైన హారాలు, పూల దండలకు బదులు మెలికలు తిరిగిన లెక్క లేనన్ని పాములను వేసుకుంటాడు. ఉండటానికి ఒక చోటు లేదు. నిత్య సంచారిగా తిరుగుతూ ఉంటాడు. నాలుగు ఇళ్ళలో అడుక్కోవడానికి మంచి గిన్నే లేక గుడ్డదైన జోలె కాకుండా, మనిషి పుర్రెని వాడుతాడు. మనిషి కపాలాల మాల మెడలో వేసుకుంటాడు. ఎంతో నిర్వికారంగా ఉండి, ఏ విషయం లోనూ ఆసక్తి చూపడు. గడగడ వణకించే మంచు కొండలలో ఉంటాడు. ఏ భోగ భాగ్యములూ ఉండవు. ఎప్పుడూ అర్ధనగ్నం గానో, దిగంబరంగా నో తిరుగుతూ ఉంటాడు."*
*"కాళీ! ఇక నీవా సర్వాంగవసుందరివి. సర్వలక్షణ భూషితవు. కలువ పూమాల ధరిస్తావు. చీనీ చీనాంబరాలు, ధగ ధగ మెరసిపోయే నగలు ధరిస్తావు. వేలమంది పరిచారికలు ఎల్లప్పుడూ నీ సేవలో సిద్ధంగా ఉంటారు. వారందరూ నీ కనుసైగలతోనే పనులు చేస్తూ ఉంటారు. హంసతూలికా తల్పాలు, కల్పతల మధ్య నీవు అల్లారు ముద్దుగా పెరిగావు. నీ తల్లిదండ్రులు మేనకా హిమవంతులకు నీవే పంచ ప్రాణాలు. నీ ఉన్నతి కోరుకునే నీ తల్లిదండ్రులు నీకు తగిన వరునితో వివాహం జరిపించడానికి ఎంతో ఆతురుత పడుతున్నారు. వారిని నిరాశ పరచ కుండా, నీ వంటి చక్కని అందగాని వివాహము చేసుకుని సుఖములు అందుకో. ఇప్పటికీ, నీ నిర్ణయం మారకపోతే, ఇంకా విను."*
*దేవీ! నీ ముఖము చక్కని కలువల వంటి కన్నులు, శంఖము వంటి మెడతో శోభిల్లుతోంది. మూడు కన్నులు, ఐదు తలలు, కంఠంలో విషం నింపుకుని వున్న శంకరుని వికృత రూపం ఎక్కడ. చందన సుగంధ లేపనములతో ఉన్న నీ శరీరానికి, నిరంతరం భస్మ భూషితమై ఉండే శంకరునికి పోలిక ఎక్కడ. పొంతన ఎలా కుదురుతుంది, తల్లీ! ఒక్కసారి ఆలోచించు. నిన్న సేవుంచడానికి దేవతలు కూడా వెనుకాడరు. కానీ, శంభుని సేవలో ఉన్నది శివకింకరులే. ఎప్పుడూ జంతుబలిని ఇష్టపడతాడు, రుద్రుడు. నీవు అత్యంత సుందరివి. సంపదల రాశివి. శివుని దగ్గర సంపదలేకనే కదా దిగంబరంగా తిరుగుతూ ఉంటాడు. ఎక్కి తిరగడానికి నీ వద్ద బలిష్టమైన సింహము ఉంటే, ఆతని వద్ద ఒక ముసలి ఎద్దు ఉంది. ఏమి సుఖపడతావు, తల్లీ, ఈ నిర్గుణ రూపాన్ని పెళ్ళి చేసుకుని. ఈ మహాదేవుని కి తాను వివాహమాడిన కన్యను సుఖబెట్టే లక్షణము ఒక్కటి కూడా లేదు. కాముని దహించి వెళ్ళినపుడే, శివునికి నీ యందు ఆదరణ లేదు అనేది స్పష్టం. ఇంకా ఎందుకమ్మా, ఈ నీ తపస్సు. ఎల్లప్పుడూ ఒంటరిగా ఉంటూ పిశాచముల సహాయంతో జీవిస్తారు, ఈ నిశాచరపతి."
*"ఈ చరాచర జగత్తు లోని అసత్యమైన వస్తును నీవు నీదిగా చేసుకోవాలి అనుకుంటున్నావు. ఇది అసాధ్యం. నీవు నీ మనసు మార్చుకో. ఇంతగా చెప్పినా కూడా నీవు తీరు మార్చుకోకపోతే, ఇక నీ ఇష్టం. నేను చెప్పడానికి ఇంక ఏమీ లేదు" అన్న విప్రుని మాటలు విన్న పార్వతి మనసులో ఆ బ్రహ్మణుని మీద విపరీతంగా కోపం కలిగింది. కొంత మౌనము తరువాత ఇలా చెప్పడం మొదలు పెట్టింది, పార్వతి.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి