*"మాసానామ్ అస్మి మార్గశీర్షోహమ్" అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధించిన ఈ మార్గశీర్ష మాసంలో, పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ సకల శుభాలు, పరమాత్మ తో దగ్గర తనం కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*శివా శివుల సంభాషణ - పార్వతి ప్రార్ధనకు శంభుని అంగీకారం*
*నారదా! తాను కోరిన విధంగా ప్రత్యక్షమై తన ఎదురుగా వున్న ఆనందమయ హర రూపమును చూస్తూ, ఆయన పలికిన మాటలను వింటూ, పార్వతి హర్ష పులకాంకిత అయి, మేను మరచి పోయ, అమిత ఆనందమును అనుభవిస్తూ " దేవదేవా! దేవేశ్వరా! ఈశానా! నా స్వామి మీరే. ఎన్నో జన్మల నుండి మీరు నేను కలిసే ఉన్నాము. మీరు, ఇంతకు ముందు దక్షుని యజ్ఞాన్ని ఎందుకోసం నాశనము చేసారో మరచి పోయారు. ఆ యజ్ఞమును నాశనము చేసిన రుద్రుడు మీరే. అప్పుడు మీరు వివాహము చేసుకున్న సతీదేవి నేనే. ఇప్పుడు తారకాసురుని కష్టాల నుండి ముల్లోకాలను కాపాడడానికి హిమవంతుని భార్య అయిన మేనక గర్భమున పార్వతి గా పుట్టాను. ఇప్పుడు నన్ను అనుగ్రహించి మీ భార్యగా స్వీకరించండి. అందువలన నా తండ్రి వంశం కూడా పరమ పవిత్రము అవుతుంది. పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. మీరు, రుషులు, మునులు, సకల గణములు, దేవతా సమూహముతో నా తండ్రి హిమవంతుని దగ్గరకు వచ్చి నన్ను మీ భార్యగా చేయమని యాచించండి. నా తండ్రి ఈ వివాహ కార్యమును బంధువులు, మిత్రులు, సకుటుంబ సపరివార సమేతంగా పూర్తి చేస్తారు. మీకు సందేహం అక్కరలేదు." అని పార్వతి పలికింది.*
"నేను దక్షుని కుమార్తె సతీదేవి గా ఉన్నప్పుడు, నా తండ్రి వివాహ కార్యక్రమం సక్రమంగా నిర్వహించలేదు. ఆ నాడు, నా తండ్రి, నీచే సృష్టించబడిన గ్రహాలను, గ్రహవాధిపతులను, శివ గణాలను విధివిహితంగా ఆదరణ చేయలేదు. ఆ కారణంగా, మీ కోపానికి పాత్రుడు అయ్యాడు, దక్షుడు. అందువల్ల, ఈ మారు, దేవతల కార్యమును సిద్దింప చేయడానికి శాస్త్రోక్తంగా వివాహ పద్ధతి పాటించి, వివాహ కార్యక్రమం పూర్తి అయ్యేటట్లు ఆశీర్వదించి అనుగ్రహించండి. తన కుమార్తె ఎంతో ఉత్తమమైన తపము చెసింది అని నా తండ్రి హిమవంతునకు తెలియాలి" అని భగవంతుడు అయిన సజ్జోజాత ముఖుని వేడుకొంది పార్వతి.*
*అంబ ప్రార్థన విన్న త్రినేత్ర ధారి ఎంతో ప్రసన్నత అనుభవిస్తూ, మందహాసం చేస్తూ, "శుభే! శివే! నీవు కళ్యాణకారివి. వరాననా! నేను ఇప్పుడు చెపుతున్న మాటలను ఆలకించు. భద్రే! బ్రహ్మ, విష్ణుమూర్తి, శివుడు, అందరు దేవతలు అనిత్యులే. కనబడుతున్నవి అన్నీ చెరిగి పోయేవే. ఇవి ఏవీ శాస్వతము కాదు. నేను నిర్గుణ పరమాత్మను. గుణాలు అన్నీ నా లోనే ఉండడం వల్ల, నా నుండి నేనే వేరు వేరు వస్తు రూపాలలో కనిపిస్తాను. ఈ జగత్తు అంతా నా వల్లనే ప్రకాశాన్ని పొందుతోంది. నా నుండే అందరికీ ప్రకాశం అందుతోంది. నేను సర్వ స్వతంత్రంగా ఉంటాను. అటువంటి నన్ను, నీవు పరతంత్రుని చేసావు, అంబే!*
" కామరూపిణీ! నీవు ప్రకృతివి. మహా మాయవు. అన్ని మాయలకు నీవే ఆలంబనము. నీలోని మూడు గుణముల చేతా, పుణ్యాత్ములు చుట్టబడి, రక్షింపబడుతూ ఉన్నారు. వరవర్ణినీ! నీవు, నేనే సమస్త జగత్తు అయినప్పుడు, ఇంక గ్రహాలు ఏమిటి, వాని పూజ ఏమిటి. కార్య కారణ బేధముల చేత, మనమిద్దరమూ భక్తవత్సులమై వివిధ రూపాలు ధరుంచి, అనుగ్రహిస్తాము. ఇది సత్యము. నీవే త్రిగుణాత్మవు. నీవే సూక్ష్మ రూప ప్రకృతివి. ఈ జగత్తు ముత్తంలో నిండిన సగుణవు నీవే, నిర్గుణవు నీవే. నేను అన్ని జీవులకు ఆత్మనై, నిర్వికారుడిగా, నిరీహుడనై ఉన్నాను. శైలసుతే! నేను భిక్షకుడిగా నీ తండ్రి హిమవంతుని వద్దకు వెళ్ళి యాచన చేయలేను. ఎందుకంటే, ఎంతటి మహత్తు కలిగిన గుణ సంపన్నులైనా "దేహీ" అని పలుకగానే, అల్పత్వాన్ని పొందుతారు. కానీ, భద్రే! నీ ఆదేశానుసారం నేను అన్ని పనులూ చేయలి కనుక, నీ కోరిక ప్రకారం నడిపించు" అన్నారు, శంకరులు.*
*"పంచాననా! శంభో! నేను ప్రకృతి. మీరు పురుషులు. మనము స్వతంత్రులము, నిర్గుణులము. అయినా కూడా భక్తుల కోసం సగుణ రూపం పొందుతాము. దేవతల కార్యం సఫలం అవడానికి మీరు నా తండ్రిని, నన్ను, మీకు ఇవ్వమని "దేహీ" అని అడిగి నా తండ్రి మీకు దాత అయ్యే సౌభాగ్యాన్ని ప్రసాదించండి. మీ దాననైన నా కోసం మీరు యాచించండి. మీరు, పరబ్రహ్మ పరమాత్ములు. ప్రకృతికి అతీతులు. నిరీహులు. స్వతంత్ర పరమేశ్వరులు అయి లీలా విహారం చేస్తూ ఉంటారు. మన వివాహ కార్యం పూర్తి కావించి మీ అనన్య యశస్సును విస్తరింప చేయండి. ప్రజలు భవసాగరమును తరిస్తారు".*
*ఈ విధంగా తన ప్రాణేశ్వరి, ప్రకృతి అయిన సర్వజ్ఞ చేసిన అందమైన ప్రార్థన విన్న శంభుడు సంతోషంగా ఆమె విన్నపానికి అంగీకారం తెలిపారు. ఇప్పుడు, అంబ పట్ల అనురాగంతో కూడిన విరహాన్ని అనుభవిస్తూ శంకరుడు అంతర్ధానం అయ్యారు. కైలాసంలో శివపార్షదులకు ఈ విషయం తెలిసి చాలా సంతోషించారు. ఉత్సవాలు జరిగాయి. రుద్రుడు కూడా సంపూర్ణ ఆనందాన్ని అనుభవించారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి