*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 023*
 కందం:
*తనకు విద్యాభ్యాసం*
*బును జేసినవానికన్న బొలుపుగ ఁబదిరె*
*ట్లును దూగు దండ్రి, వానికి*
*జననీయుఁ బదిరెట్లు ఁదూగు జగతిఁ కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద నీకు చదువు చెప్పిన గురువు కంటే నీ తండ్రి పది రెట్టు గొప్పవాడు. వీరిద్దరి కంటే పది రెట్లు గొప్పది నీ తల్లి....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ప్రకృతీ పురుషులు, తల్లిదండ్రులు అనే వారు లేకపోతే ఈ భుమి మీద మనం లేము. ఇది సత్యం. ఇదే సత్యం. మన జీవితం ముందుకు సాగడానికి ముఖ్యమైన వ్యక్తి, మనకు పాఠాలు నేర్పే గురువు. ఈ గురువు కంటే కూడా తల్లి పాత్ర ముఖ్యమైనది. తల్లి లేకపోతే తండ్రి లేడు. వీరిద్దరూ లేకపోతే మనంలేము. మన ఉనికికి మూలం తల్లి. అందుకే "తల్లి నిజం. తండ్రి నమ్మకం" అన్నారు పెద్దలు. మన జీవితానికి అతి ముఖ్యమైన తల్లిదండ్రుల ప్రాముఖ్యతను గుర్తించి, వారికి ఇవ్వ వలసిన మర్యాద ఇస్తూ, జీవిత గమనాన్ని చక్కని దారిలో సాగించే సదవకాశాన్ని కలిగించమని....... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం