*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 024*
 కందం:
*తమ్ములు తమయన్న యెడ భ*
*యమ్మును భక్తియును గలిగి యారాధింపన్*
*దమ్ము నన్నయు సమ్మో*
*దమ్మును బ్రేమింపఁ గీర్ఇ దనరు ఁకుమారా !*
తా:
కుమారా! తమ్ముళ్ళు వారి అన్న పట్ల భయము భక్తి గలిగి ఉండి ఆరాధనా భావం తో గౌరవంగా ఉండాలి. అలాగే, ఆ అన్న కూడా తన తమ్ముల మీద ఆదరణ, ప్రేమ మమకారము కలిగి ఉండాలి. ఇలా వున్న అన్నదమ్ములు కీర్తని పొందుతారు....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*అన్నదమ్ములు అంటే, రామ, భరత, లక్ష్మణ, శతృఘ్నులు లాగానో, ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవుల లాగోనో ఉండాలి అని పెద్దలు చెప్పే మాట. అన్నా! నువు పాచికలు ఆడటమేమిటి? మా వంతు భాగాన్ని, మమ్మల్ని, ద్రౌపదిని పందెం కాయడమేమిటి అని ధర్మరాజుని ఆతని తమ్ముళ్ళు అడగలేదు. ఎంతో గౌరవం తో అన్నమాట పాటించారు. కోపంతో ప్రపంచాన్ని నాశనం చేయాలి అని ఊగిపోతున్న భీముడు, వంట వండడానికి ఈ పళ్ళు ఇచ్చే చెట్టును చంప కూడదు వేరే వెతుక్కో అంటే మారు మాటాడక వెళ్ళి పోయాడు. ఇది మనం పెద్దవారి ఎడ చూపవలసిన విధేయత. దశరథ కుమారులు గానీ, పాండు పుత్రులు కానీ రాజ్యం కోసం తమలో తాము కొట్టుకుని చంపు కోలేదు. ఇంతటి అన్యోన్యత మన అన్నదమ్ముల మధ్య మనకు ఏర్పరచమని ...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు