కందం:
*అప్పం దన తల్లిగ మే*
*లొప్పంగని జరుపవలయు సుర్వీస్థలిఁజి*
*న్నప్పుడు చన్నిడి మనిపిన*
*నప్పడతియు మాతృతుల్యయండ్రు కుమారా !*
తా:
కుమారా! నీ అక్కను కూడా నీ తల్లి లాగా గౌరవించి ఆదరించు. నీ చిన్నతనంలో నీకు పాలు పట్టిన స్త్రీ నీ కన్న తల్లి కాక పోయినా, కన్న తల్లి గానే భావించు....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*పరస్త్రీ ని గౌరవించడం మన సంస్కృతి సంప్రదాయాలలో అంతర్లీనంగా సరస్వతీ నది లాగా పారుతూ ఉంది. ఉంటుంది. వివాహ సమయంలో అరుంధతీ దేవిని గౌరవించడం. సర్వస్వతీ నమస్తుభ్యం అని చదువు ప్రారంభించడం వంటివి అనూచానంగా మన పెద్దలు పాటించి మనకు అందించిన విలువైన, పాటించవలసిన నియమాలు. ఇటువంటి చక్కని సంస్కృతిని మనం ఆచరించి మన తరువాతి తరానికి అందించే సదవకాశాన్ని పరమేశ్వరుడు మనకు కలిగించాలని ...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి