పద్మ శ్రీ బందా గారు (10);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అదేంటి కోటేశ్వరావు గారు  మా అమ్మానాన్న పెట్టిన పేరును నేను ఎలా కుదించాలి చెప్పండి  ప్రభుత్వం వారిచ్చిన ఉద్యోగాన్ని కాదంటే కుదురుతుందా  చెప్పక తప్పదు అనేసరికి  ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు  ఆ రాత్రి ప్రసారం అయిన తర్వాత చివరిలో పేర్లుచెప్పడానికి చివరి వరకు బాగానే చెప్పి  వారి పేరు  చెప్పవలసి వచ్చేసరికి కందా బంక లింగేశ్వరరావు అని చెప్పాడు. తెల్లవారి మీటింగులో అతనికి మెమో ఇద్దాం అంటే  బందాగారు లేచి అతని తప్పేమీ లేదు తప్పంతా నాది  ఈరోజు నుంచి నా పేరు బందా అని చెప్పండి ఇంకా ఏమి అవసరం లేదు అని చెప్పేసరికి అందరూ తెల్ల మొహం వేశారు. విరోధులను కూడా క్షమించ గలిగిన ఔదార్యం   బందా గారికి ఉంది అని చెప్పడానికి ఈ ఉదంతం.
నాన్నా నీకు నాలుగు రోజులు కాంటాక్ట్ ఇస్తాను. రాగలవా అని అడిగారు బందా గారు  నాలుగు కాదు 40 రోజులైనా వస్తాను  మీరు ఏది చేయమంటే అది చేస్తాను  అని చెప్పేసరికి ఆయన ఎంతో సంతోషించి  నాలుగు రోజులు దాటిన తర్వాత నాలుగు రోజులు కాంటాక్ట్స్ ఇచ్చారు  దాని తర్వాత ఒక్కరోజు ఆగి మళ్లీ 14 రోజులకు పిలిచినప్పుడు సార్ పరీక్షలు జరగబోతున్నాయి పరీక్షలు రాసి  వస్తానంటే ఆయన  పరీక్షా....బావుంది మంచి మార్కులతో  పాస్ అవుతావ్ ఏం చేస్తావ్ ఉద్యోగ మేగా అది నేనే ఇస్తాను నానాటకశాఖలో నువ్వే ప్రధాన వ్యక్తిగా ఉంటావు అంతకన్నా ఇంకేం కావాలి  అనేసరికి నాకు   ఎంతో ధైర్యం వచ్చింది. జీవితంలో స్థిరపడ్డాను  అనుకుని  వారు చెప్పినట్టే చేశాను  దానితో ఆయన చాలా సంతోషించారు.
కాలేజీ నుంచి  రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన సాక్రిఫైజ్ నాటకాన్ని  బలిదానంగా బెల్లంకొండ రామదాసు అనువదించిన దాన్ని  తీసుకొని  నేను  సినిమా నిర్మాత రవీంద్రనాథ్ నా సహాధ్యాయులు శాంతి ఫ్రాన్సిస్ ఆమె చెల్లి మేరీఫ్రాన్సిస్ ఆకాశవాణిలో రికార్డు చేశాను ఛార్లెస్ డికెన్స్ నవల ఆధారంగా  ఆంగ్ల  ఉపాధ్యాయులు హిరియణ్ణ గారి నిర్వహణలో ఫేట్ స్టోరీ చేశాను  దానిలో రేడియోలో పనిచేస్తున్న  ఏ.వై మన్నార్ తమ్ముడు మునులు సుభాన్ సింగ్  సూర్య ప్రభావతి (డాక్టర్) నటించిన  రేడియోకు రాకముందు  ఈ రెండు నాటకాలతో  నాకు రేడియోలో అనుభవం. దాంతో కాలేజీలో కూడా నన్ను చాలా గొప్ప నటుడిగా  గౌరవించేవారు. అలా ప్రారంభమైన నా నాటక చరిత్ర  రేడియోకు సంబంధించినది. తరువాత ఉద్యోగం వచ్చింది.

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం