ముదునూరు నుంచి గాని ఉయ్యూరు నుంచి గాని కారులో బయలుదేరి వెళ్లేటప్పుడు తప్పకుండా వచ్చి నాన్నతో మాట్లాడి వెళ్లేవారు కాకాని వారు. ఒకరోజు అరే మీ పెద్దబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగితే పొలం వెళ్ళాడు పని చేయడానికి అనగానే ఆయనకు కోపం వచ్చి కారు డ్రైవర్ని పిలిచి పొలం పంపించి మా అన్నయ్యను తీసుకువచ్చి తన వివరాలన్నీ కనుక్కొని ప్రభుత్వ ఖర్చుల పైన మద్రాస్ పంపి అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత మా గ్రామంలోనే మాస్టర్ గా ఉద్యోగం ఇప్పించారు కాకానీ వారు మా అన్నయ్య కే కాదు నిజాయితీగా పనిచేసే కొన్ని వేల మందికి సహాయం చేసి తన గొప్ప మనసు చాటు కున్న గొప్ప వ్యక్తి కాకాని వెంకట రత్నం గారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో విజయవాడలో వారితో పాటు భాస్కర్, నేను, మా ఎమ్మెల్యే బోస్ అంతా ఉండగా కాకాని వారిని బయటికి వెళ్లకుండా ఎవరు ఎన్ని చెప్పినా ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ రోజున ప్రకాశం పంతులుగారు ఇంగ్లీష్ వారికి గుండె చూయించిన పద్ధతిలో కాకాని వెంకట రత్నం గారు రాష్ట్ర ప్రగతి కోసం చివరి నిమిషం వరకు పోరాడి రాష్ట్రం కోసమే ప్రాణాలను పణంగా పెట్టినవారు కాకాని వెంకటరత్నం గారు. గొప్ప దేశభక్తి కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తితో మాకు అతి సన్నిహిత సంబంధాలు ఉండడం మా సంచిత జన్మ ఫలం అని నేను అనుకుంటున్నాను. జీవితంలో మరపురాని వ్యక్తిగా మా మనసులలో మిగిలిపోయారు ఆయన భౌతికంగా దూరమైనా వారి మాటలు మాకు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. వారి పనులు కనిపిస్తే కనిపిస్తూనే ఉంటాయి ఎన్ని మధురస్మృతులను వదిలి వెళ్ళారు మన కోసం.
భాస్కర్ కు మొదటి నుంచి ఉన్న అభిప్రాయం ప్రతి గ్రామానికి ఒక గ్రంథాలయం ఉండి తీరాలి తన గ్రామం ఏమిటో ఇతర గ్రామాలకు తెలియాలి గాంధీ మహాత్ముడు చెప్పిన గ్రామ పునరుద్ధరణ కాకుండా ఆదర్శ గ్రామంగా మెలగాలి ప్రతి గ్రామం వారు ఆ గ్రామంలో లాగా మనం కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనుకునే అభిప్రాయం రావాలి దానితో ఒకరిని మించి మరొకరు అంకిత భావంతో పనిచేసి పోటీ తత్వంతో చేసే పని ఎప్పుడూ కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి గ్రామాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఒకరితో జరిగే విషయం కాదు ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ దానికోసం పాటుపడాలి చివరకు చిన్న పిల్లలు కూడా రోడ్లమీద ఇష్టం వచ్చినట్లు కాగితాలు చించిపడేయడం ఎక్కడబడితే అక్కడ ఉమ్ములు వేయడం లాంటివి మానుకోవాలి. మనసులో ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దానిని కార్యరూపంలో సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది ఆ దృష్టితో తాను ఏ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నా స్వగ్రామాన్ని గురించి ఆలోచిస్తూ దాని భవిష్యత్తు నిర్మాణం కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుని ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు స్వగ్రామానికి వచ్చి పెద్దలతోనే కాదు సామాన్య ప్రజలతో కూడా ఆలోచించి వారి సహకారం లేకపోతే ఏది మనం చేయలేము అన్న నిశ్చయానికి వచ్చి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరితోపాటుతో గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి ప్రత్యేకించి స్త్రీలు పూనుకున్నట్లయితే ఇలాంటి పనులు చాలా త్వరగా అవుతాయి. పురుషుని చేయమని తొందర పెట్టేది ఆమే. ఎవరు చెప్పినా వినని వాడు భార్య చెప్పినప్పుడు తప్పకుండా వింటాడు. ఇలాంటి ఆలోచనలతో ముదునూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన ఘనత భాస్కరరావుకి దక్కుతుంది ఇలాంటి గ్రామాలు మరిన్ని వస్తే తప్ప దేశానికి ముక్తి లేదు.
మా ఆత్మీయుడు భాస్కర్ (10);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9493811322
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి