తిరుప్పావై పాశురం-10;-డాక్టర్ అడిగొప్పుల సదయ్యజమ్మికుంట,కరీంనగర్9963991125
నోత్తుచ్చువర్కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్!
మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుజాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్తప్పఱైతరుమ్ పుణ్ణియనాల్ పణ్డొరునాళ్

కూత్తత్తిన్ వాయ్ వీజన్ద కుమ్బ కరణనుమ్
తోత్తుమ్ ఉనక్కే పెరున్దుయిల్ తాన్ తందానో?
ఆత్త అనన్దలుడైయాయ్ అరుఙ్గలమే!
తేత్తమాయ్ వందు తిఱ ఏలో రెంబావాయ్

తిరుప్పావై ఇష్టపది-10

నోచి స్వర్గము నందు నోలలాడెడి బాల!
తలుపైన తెరువకను పలుకైన పలుకవే!
సౌగంధ బృందధరి శౌరి,నారాయణుడు
మనచేత పల్లాండు పాడించి,పరనిచ్చు.

త్రేతాయుగంబులో ధీరరాఘవునిచే
కోణపాస్యము బడ్డ కుంభకర్ణుడు నీకు
తొత్తుయై తన నిద్ర మొత్తమును నీకిచ్చి
వెళ్ళెనా యేమిటే?! విమల నిద్రాభరణి!

మత్తునిద్రను వీడి మము కూడి రావమ్మ!
ఇది మాదు వ్రతమండి! ఇచ్ఛతో చేరండి!

సౌగంధ బృందధరి=మంచి పరిమళముగల తులసిని ధరించినవాడు
శౌరి = శ్రీ మహావిష్ణువు;పల్లాండు=మంగళ హారతి
కోణప+ఆస్యము బడ్డ= యముని నోటిలో పడిన
తొత్తు = బానిస
విమల నిద్రాభరణి = నిద్ర అనెడి మంచి ఆభరణము కలదానా!



కామెంట్‌లు
Unknown చెప్పారు…
అద్భుతః