నేను ఆకాశవాణి కేంద్రానికి వచ్చిన తర్వాత వచ్చిన లింగరాజు శర్మగారు, కమల కుమారి గారు పేరు పొందిన రంగస్థల నటులు అద్దంకి శ్రీరామ్ మూర్తి గారితో కలిసి కమల కుమారి గారు నాటకాలను ప్రదర్శించారు పద్య గద్యాలను అందంగా చెప్పగలరు ఆమెను ఆకాశవాణికి పరిచయం చేసింది శ్రీ వత్సవ గారు. మొదట ఆవిడ నాటకాలు వేస్తున్నది అన్న విషయం నాకు తెలియదు ఒకరోజు బందా గారు పిలిచి నాన్నా తారాబాయి నాటకం బావుంది నీ పాత్రకు మంచి పేరు వస్తుంది దీనిలో ప్రధానమైన పాత్ర తారాబాయి నీకు తల్లి పాత్ర కమల కుమారి గారు వేస్తున్నారు. మీరిద్దరూ చేస్తే ఆ నాటకానికి వస్తుంది ఆ తర్వాతప్రసారమై మంచి పేరు తీసుకువచ్చింది ఆ తర్వాత అనేక నాటకాలలో నాతో నటించినది కమల్ కుమారి అక్కయ్య.
ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో వారి మంత్రులలో ముఖ్యమైన కేకే షా విజయవాడ వచ్చి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఎవరెవరు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చి అందరినీ సమావేశపరచి పేరుపేరునా అందరి గురించి తెలుసుకొని ప్రస్తుతం మీకు కావలసినది ఏమిటి అని అడిగారు అందరూ ఎవరు మొహాలు వారు చూసుకుంటున్నారు. కారణం భాష నూటికి 99 మందికి తెలుగు తప్ప మరో భాష రాదు అప్పుడు ధైర్యంగా బందా కనక లింగేశ్వర రావు గారు లేచి సార్ మాకు నెలకు 150 రూపాయలు జీతం ఇస్తున్నారు. మా కళాకారులు అందరూ ఉదయం వస్తే రాత్రి వరకు కష్టపడుతూనే ఉంటారు. కుటుంబ పోషణకు ఆ వచ్చే జీతం ఏ విధంగా సరిపోతుంది సార్ కనుక మాకు జీతాలు పెంచండి అని విజ్ఞప్తి చేశారు.
దానికి షా నవ్వుతూ మీ కోణం నుంచి మీరు చెప్పిన విషయం నూటికి నూరుపాళ్లు నిజం కానీ ప్రభుత్వ పరంగా మేము ఆలోచించే దాని గురించి కూడా మీరు ఊహించండి మీరు ఎవరి డ్యూటీ వారు చేస్తున్నారు కాదనలేను. ఇవాళ రాత్రిపూట టాపిక్ ఫర్ టు డే రికార్డ్ చేయాలి అంటే ఫ్రాంక్మోరిస్ అని పిలవాలి ఒక మంచి పాట కావాలంటే లతా మంగేష్కర్ ని, మహమ్మద్ రఫీని పిలవాలి. మీకు డబ్బులు ఎక్కువ ఇచ్చి వేరే వారికి మళ్ళీ డబ్బు ఇచ్చి పాడించుకోవడం కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి ఎంత నష్టం రెండు రకాల ఖర్చులను భరిస్తుందా ఒకే విషయం కోసం మీరు ఆ విషయాన్ని నిర్ణయించుకొని మీ అభిప్రాయాలను తెలియజేస్తే నేను చాలా ఆనందిస్తాను అని చెప్పారు. మళ్లీ బందా గారు లేచారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి