జగతికి వెన్నెముక స్త్రీ (12);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నూతన వధువు ఏ గృహిణి అయినా ఆ ఇంటిలో పిల్లలకు పెద్దలకు క్రమశిక్షణ చేపట్టడానికి తన ప్రయత్నం తాను చేస్తుంది. ఉదయం భోజనం చేసిన తర్వాత  అందరూ ఆ ప్లేట్లలోనే చేతులు కడిగి వెళ్ళిపోతారు హాయిగా
కానీ ఆ భాధ్యత లేదు అని తెలిసి ముందు పాపను పిలిచి చూడమ్మా నువ్వు తిన్న పళ్ళెం చుట్టూ ఎంగిలి పడింది కదా. అదంతా తీసి శుభ్రం చేసి పళ్ళాన్ని తీసుకొని వెళ్లి సింక్ దగ్గర పెట్టు అన్నీ కలిపి ఒకసారి శుభ్రం చేసుకోవచ్చు  అని చెప్పినప్పుడు నేను తీయను అని మారం చేస్తుందా? వదిన ఏది చెబితే అది అక్షరాల చేసి తీరవలసినదే. అప్పటికే అంత గౌరవాన్ని తాను  పొంది ఉంటుంది. తర్వాత బాబు ఇది చూస్తూ వదిన చెప్పకుండానే తన పని తాను చేస్తాడు.  రెండో రోజు నుంచి పిల్లలు ఇలా చేస్తూ ఉంటే భర్తకు ఏమనిపిస్తుంది తాను కూడా పిల్లలను అనుసరించి వారు చేసినట్లు చేస్తాడు.
ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడం కోసం కృషి చేస్తుంది గృహిణి. ఎలాంటి చెడు ప్రభావం చూపని ఆహారాన్ని తయారుచేసి తగిన పాళ్లలో  పదార్థాలను వారికి తినిపించినప్పుడు అది కూడా ప్రతిరోజు ఏ సమయానికి ఏది తినాలో దానిని వడ్డిస్తూ ఉన్నప్పుడు  అనారోగ్యం ఎందుకు వస్తుంది. ఇలాంటి కోడలిని చూసి ఏ అత్త మామ ఆనందించకుండా ఉంటారు నిజానికి వారు అనవసరంగా తలదూర్చుతారా? మరి భర్త విషయానికొస్తే ఇంత గొప్ప భార్య దొరికినందుకు ఆమె ముఖం మీద ప్రశంసలు కురిపించినా కురిపించకపోయినా తన బంధువులతో కానీ, స్నేహితులతో కానీ  గొప్పగా చెప్పుకోడా? అది తన గౌరవాన్ని పెంచుతుందే గాని తగ్గించదు కదా ఆ సంస్కారం కూడా కావాలి. ఇంకా ఆరోగ్య విషయానికొస్తే  చిన్నపిల్లలకు  త్వరగా చిన్న చిన్న రుగ్మతలు వస్తూ ఉంటాయి. గృహ వైద్యం పేరుతో ఆమె పోపుల డబ్బాలో ఉన్న  పదార్థాలతో వైద్యం చేసి వారిని రక్షిస్తుంది. భర్త ఒకరోజు నాకు నిన్న ఇవాళ  విరోచనం కాలేదు  మందుల షాపుకి వెళ్లి ఏదైనా టాబ్లెట్ గాని సిరప్ గాని తెచ్చుకుంటాను అంటే  అవసరం లేదు లెండి రేపటికి బాగానే అవుతుంది కొంచెం ఓపిక పట్టండి అంటుంది. మరి దానికి మందు ఇవ్వాలా? అవసరం లేదా? ఆమె ఏం చేస్తుంది  సునామని ఆకు తీసుకొని దానితో చారు పెట్టి  మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత వేడివేడిగా ఒక గ్లాసుడు తాగిస్తుంది. అది ఏమిటి ఎందుకు అని కూడా చెప్పదు  తెలవారి హాయిగా  సాఫీగా అవుతుంది  భర్తకు కారణం తెలుసుకోవాలన్న కుతూహలం కూడా ఉండదు. అలా తన కుటుంబాన్ని రక్షించుకునే వైద్యురాలు ఆ గృహిణి. మరి ప్రతి ఒక్కరు  అలాంటి తల్లికి పాద నమస్కరాలు చేయనవసరం లేదా....ఆలోచించండి.



కామెంట్‌లు