నిజానికి గృహిణి లాంటి సమన్వయకర్త మరి ఎక్కడా ఉండదు ఇంటిలో అందరిని ఒకే రకంగా ఎలా ప్రేమించగలదో బయట నుంచి అమ్మ అని పిలిచి వచ్చే ప్రతి ఒక్కరికి తన మనసులో అదే స్థానాన్ని ఇస్తుంది.కొంతమంది కాలక్షేమం కోసం వచ్చి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ గడుపుతారు మరి కొందరు స్నేహాన్ని పెంచుకోవడానికి వచ్చి తమ ప్రవర మొత్తం చెప్పి వీరి గురించి తెలుసుకున్న తర్వాత స్నేహాన్ని బలంగా ఉండేలా చూసుకుంటారు ఈ వచ్చే వారిలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు నిజంగా స్నేహం కోసం వచ్చేవారు ప్రేమను పంచేవారు ఉన్నా మరి కొందరు కుచ్చిత మనస్తత్వంతో వీరి ఇంటి రహస్యాలు తెలుసుకొని దానిని ప్రచారం చేయడం కోసం వచ్చే వారు ఒకతెగ వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
అలా జాగ్రత్త పడాలంటే ముందు వారి మనస్సు తెలుసుకోవాలి కదా అలాగే చేస్తుంది గృహిణి. అసలు ఏ గృహిణి ని చూసినా ఎవరికైనా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఎంతో హుషారుగా కలుపుగోలుగా అన్ని కబుర్లు అక్కడివి ఇక్కడ ఇక్కడివి అక్కడ చెప్పుకుంటూ అందరినీ అలరించిన పిల్ల గృహిణి అయ్యే సరికి ఎంత మార్పు వచ్చిందో? ఎలా వచ్చిందబ్బా అనుకోక తప్పదు అది భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో ఉన్న లక్షణం అలా అని ఏ ఒక్కరిని కించపరచడం కానీ వారి మనసులను బాధ పెట్టడం కానీ జరిగే విషయాలను ప్రస్తావించకూడదు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది అంటే ఎక్కడో గురువు గారి దగ్గర పాఠం నేర్చుకున్న విద్య కాదు స్వతహాగా మానవ మనస్తత్వాన్ని అధ్యయనం చేసిన అనుభవం అలా తయారు చేస్తుంది అందుకే అమ్మ అంటే అంత ఆత్మీయం.
గృహిణి ఎంత జాగ్రత్త వహించినా అప్పుడప్పుడు చిన్నచిన్న ప్రమాదాలు తప్పవు పాలు పొంగిపోతుంటాయి దానిపైన నీళ్లు చల్లే ప్రయత్నంలో ఒక్కొక్కసారి ఆ వేడివేడి పాలు చేతి మీద పడి బొబ్బలు వచ్చే అవకాశం ఉంది అది భర్తకు గాని, పిల్లలకు కానీ తెలియకుండా పవిట చాటున దాచుకుంటుంది వారు బాధ పడతారని తన బాధ. కూరలు కొసేటప్పుడు గాని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తరిగేటప్పుడు కానీ పొరపాటుగా కత్తిపీట కానీ, చాకు కానీ తగిలే అవకాశం ఉంది రక్తం కూడా వస్తోంది.ఆ రక్తాన్ని ఎవరికీ తెలియకుండా అక్కడి వంటగదిలో తన పక్కనే ఉన్న పసుపు తీసి రాసి ప్రధమ చికిత్స తనకు తానే చేసుకుంటుంది. అంతేతప్ప అరిచి కేకలు వేసి అందరికి తెలిసేట్లుగా ప్రవర్తించదు. అందుకే క్షమయా ధరిత్రీ అంటారు స్త్రీని.భూదేవి అంత ఓపిక కలది అనే అర్థం ఈమె దానిని సార్థకం చేస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి