షా గారూ మీరు ఢిల్లీ కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు సార్ మేము చేయవలసిన కార్యక్రమాలను మా శక్తి కొలది నిలయ కళాకారులు కొన్ని సంగీత కచేరీలను చేయడం కోసం కొంతమందిని పిలవడం తప్పదు. ఎవరైనా ముఖ్యమైన అతిథి వచ్చినప్పుడు వారిని కూడా మేమే పరిచయ కార్యక్రమంలో మాట్లాడుతూ ఉంటాం. ప్రశ్నోత్తర కార్యక్రమాలు కూడా మేమే చేస్తూ ఉంటాం. ఏ కార్యక్రమానికి మా కేంద్రం తరఫున ఏ ఒక్క పైసా ఖర్చు చేయడం లేదు. దానిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రూపాయి విలువ ఎంత ఉంది, మీరిస్తున్న జీతం ఎంతమందికి సరిపోతుంది అన్న విషయాన్ని మీరు ఒక నిర్ణయానికి వస్తారని మా భావం. సానుకూలంగా మీరు స్పందిస్తారని మేము అందరం అనుకుంటున్నాం. అనేసరికి అలాగే నా ప్రయత్నం నేను చేస్తాను అని ఢిల్లీ వెళ్లి ఆ ప్రయత్నం చేయడానికి ఆయన పద్ధతిలో చేస్తున్న సమయంలో అతనిని వేరే చోటకు (మద్రాసు) బదిలీ చేశారు గవర్నర్ గా. అప్పటివరకు మా కేంద్రంలో బందా గారు లాయర్ వృత్తి చేశారన్న విషయం చాలా మందికి తెలియదు.
బందా గారి జీవితాన్ని గురించి మాతో మాట్లాడేటప్పుడు కుక్క బ్రతుకురా మనది కుక్క కాపలా అని అంటూ ఉండేవారు. ఆయన ఎందుకన్నారు మంచిగా అన్నారా చెడ్డగా అన్నారా అర్థం అయ్యేది కాదు మాకు తర్వాత కొంతకాలానికి మా ఇంట్లో జిప్సీ అన్న కుక్కను పెంచాం అది మాతో సమానంగా ప్రవర్తించేది రాత్రులు నిద్రపోయేటప్పుడు కూడా మా పిల్లల దగ్గర పండుకునేది రా అంటే రావడం పో అంటే పోవడం చేసేది మా ఇంట్లో చంటి పిల్లను చూసినట్టుగా చూసేవాళ్ళం. ఎందుకు అలా చేస్తున్నారో నాకు అప్పటికి అర్థం కాలేదు తర్వాత ఒక సందర్భంలో నాతో స్నేహానికి వచ్చింది నాకది ఇష్టం ఉండదు అదీ కాక కుక్కల వల్ల కొన్ని జబ్బులు కూడా సంక్రమిస్తాయి అని ఎక్కడో చదివినట్టు గుర్తు. అయినా అది నన్ను వదిలేది కాదు.
నా చుట్టూ తిరుగుతూ నా ప్రక్కనే ఉండేది నేను అరటి పండు తింటున్నా మరి ఏదైనా దానికి పెట్టకుండా తినేవాణ్ణి కాదు దానిని పిల్లల కన్నా ఎక్కువ చూసుకున్నాం నాతో నిజానికి చక్కగా ఆడుతుంది. మనల్ని ఆడేలా చేస్తుంది. దాని జీవితకాలం ఏడు సంవత్సరాలు అది దాటితే మరొక ఏడు సంవత్సరాలు అంతకుమించి లేదు. అందరితో అంత ఆప్యాయంగా ఉన్న మా జిప్సీ చిన్న జబ్బు చేసి వైద్యం చేయించినా కూడా అది చనిపోయింది. అది చనిపోగానే నాకు దుఃఖం ఆగలేదు నా భార్య కూడా ఎంతో బాధపడింది, మదన పడింది. పిల్లలైతే రెండు నెలల వరకు భోజనం చేయలేదు వాళ్ళమ్మ బ్రతిమలాడి ఆరోగ్యం బాగుండదురా తినమని చెప్పితే అప్పుడు సగం సగం భోజనాలు చేసేవాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి