తిరుప్పావై పాశురం-12;-డాక్టర్ అడిగొప్పుల సదయ్యజమ్మికుంట, కరీంనగర్9963991125
కనైత్తిళంగ త్తెరుమై కన్రుక్కిరంగి
నినైత్తుములై వళియే నిన్రు పాల్ శోర
ననైత్తిల్లమ్ శేరాక్కుమ్ నర్చెల్వన్తంగాయ్
పనిత్తిలై వీళ నిన్ వాశల్ కడైపత్తి

చ్చినత్తినాళ్ తెన్నిలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై పాడవుమ్ నీవాయ్  తిరవాయ్
ఇనిత్తా నెళున్దిరాయ్ ఈదెన్న పేరురక్కమ్
అనైత్తిల్లత్తారు మరిన్దేలో రెంబావాయ్!

తిరుప్పావై ఇష్టపది-12

పాలకై వరలుచూ బాలదూడలు నరువ
మొదవు పొదువులు గురిసి ముంగిళ్ళు బురదాయె
సిరులు పాలై కురియు శ్రీమంతు చెల్లెలా!
పొడిమంచు తలగురియ వడకుచూ మీయింటి

తలుపు గొళ్ళెము పట్టి, తలచి పాడెదమమ్మ!
శ్రీలంక నాయకుని శీర్షములు తెగద్రెంచి
హతము చేసిన ధర్మ మతియు శ్రీరాముణ్ణి;
నోరు తెరచియునికను నోచుటకు లేచిరా!

ఇదియేమి నిదురయని వెరగొందె పొరుగంత!
ఇది మాదు వ్రతమండి! ఇచ్ఛతో చేరండి!!

వరలుచు = బాధపడుచు;మొదవు =పాడియావు
పొదువులు = పొదుగులు;వడకుచూ= చలికి వణకుచూ
వెరగొందె = ఆశ్చర్యపడెను
కామెంట్‌లు