జగతికి వెన్నెముక స్త్రీ (13);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
ప్రతి తల్లి తన బిడ్డను ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా పెంచుతున్నాను అనుకుంటుంది  నిజంగా మనసుపెట్టి పెంచుతుంది  ఆ చంటి వాడికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఏ క్షణాన ఏది కావాలో దానిని వాడికి సంతృప్తిగా ఉంచేలా ప్రయత్నం చేసి  ఉదయం లేవగానే  కార్యక్రమాలను పూర్తి చేయించి  పాలు తాగించి కాసేపు చదివించి  భోజనం పెట్టి అతనిని సిద్ధం చేసి బడికి పంపించేంత వరకు కూడా  ఆమెకు ఒక క్షణం తీరిక ఉండదు ఇతనిని చూడడమే కాదు కదా  ఆ ఇంటి పనులన్నీ కూడా తానే దగ్గరుండి చూసుకోవాలి  ఒకవేళ పనిమనిషి ఉండి తాను చేసినా, తాను శుభ్రం చేసిన ప్రతి వస్తువును తిరిగి ఈమె శుభ్రం చేసుకుంటూనే ఉంటుంది. ఇది ప్రతి గృహిణి ప్రతి ఇంట్లో  చేస్తున్న నిత్య కార్యక్రమాల్లో భాగము.
లేవగానే బిడ్డ  కాల కృత్యాలు తీర్చుకోవడానికి ఉపక్రమించి, అయిపోయిన తర్వాత  ముఖం కడగడానికి వస్తారు. చక్కగా బ్రష్ దానిపైన పేస్టు పెడితే చకచకా అటు చివర నుంచి ఇటు చివర వరకు తోమి నోటికి నురుగు రాగానే కడిగిపారవేస్తారు. కానీ అమ్మ తన చిన్నతనంలో అలా చేసిందా పొందుం పుల్ల, వేప పుల్లను కానీ, గానుగ పుల్లను కానీ తీసుకొని నోటిలో కాసేపు నానబెట్టి  ఒక అర అంగుళం మేర కుచ్చు వచ్చేట్లుగా నమిలి  ఆమెత్తటి కుచ్చుతో ఈ చివరి నుంచి ఆ చివరకు కడిగి  పళ్లకు పైన కింద  పై పైన కడిగిన తర్వాత నోరు తెరిచి లోపల ప్రతి పన్ను శుభ్రపడేట్లుగా  కడిగిన తర్వాత  మొహం కడగడం వల్ల వచ్చే లాభాలు గానుగ పుల్లతో కడగడం వలన  నోరు సువాసనతో ఉంటుంది  నోటిలో ఉన్న క్రిములు అన్ని చనిపోతాయి. వేప పుల్ల గానుగ పుల్ల కన్నా వేగంగా నోటిలో ఉన్న రోగకారక క్రిములను వెంటనే చంపివేస్తుంది కనుక జీవితాంతం వారికి పండ్లకు సంబంధించిన  ఏ రుగ్మత దరిచేరదు. తరువాత బిడ్డ స్నానం చేయడానికి వెళ్లి  శరీరం తడిచేట్లుగా  నీళ్లు పోసి సబ్బుతో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తోమి స్నానం చేసుకున్నాను అన్న తృప్తితో బయటకు వస్తాడు మరి అమ్మ చిన్నతనంలో వారి అమ్మ అలా అంగీకరించేదా అమ్మ పాపగా ఉన్నప్పుడు తాను స్నానం చేసి  ఎలా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటుందో  ప్రతి వారం కూడా  ప్రత్యేకించి శనివారం  తలంటు పోస్తుంది అమ్మ  తలంటుతుంది అంటే  అభ్యంగన స్నానం  నిత్యం శరీరాన్ని తడుపుతూ స్నానం అని ఆ పాప  భావించి అలా చేస్తోంది కానీ అమ్మ స్నానం ఎలా ఉండాలి అంటే కుంకుడి కాయలు మెత్తగా కొట్టి దాని రసం తీసి  జుట్టులో నురుగు వచ్చేలా రుద్ది స్నానం చేయించి  రెండోసారి మళ్లీ  కుంకుడు రసంతో రుద్ది బాగా నురుగు వచ్చిన తర్వాత నీళ్లతో శుభ్రం చేస్తోంది. అదీ సరైన స్నానం.


కామెంట్‌లు