పాపం...పడతి (13);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఏ ఇంట్లోనైనా చూడండి  చాలామంది  గృహిణిని ఏమిటి వంట చేస్తున్నావా  24 గంటలు ఈ పనేనా  అదేమన్నా బ్రహ్మవిద్యా. దానికి అంత సమయం కావాలా  అని వెటకరించే ముందు అక్కడ ఆమె సామర్థ్యాన్ని, సుగుణాన్ని  తెలుసుకొని ఆ గుణాలన్నీ మనలో ఉన్నాయా అని ఒక్కసారి ఆలోచించుకుంటే  ఏ మగవాడు అలాంటి పిచ్చి, పిచ్చి కూతలు కూయడు అని నా ఉద్దేశం. వంట పని చాలా అందమైనది  పాకశాస్త్రము అని దానికి పేరు. మగవాళ్ళలో నలుడు భీముడు కూడా ఈ శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అనుసరించి  ఎన్ని వందల మంది వచ్చినా వండి వార్చి పెట్టగలరు. అలాంటి విషయాన్ని ఎందుకు ఈ మగవారు అర్థం చేసుకోలేకపోతున్నారో తెలియదు అయినా ఆ స్త్రీ ఎప్పుడూ వీళ్ళని పన్నెత్తు మాట అని ఎరగదు  అంత సహన మూర్తి. ఈ వంట పని ఎంత అందంగా చేయవచ్చునో అంత అవసరమైనది కూడా  ఆడది వంట చేయకపోయినట్లయితే మీ నోర్లు కట్టుబడి పోతాయి  ఆహారం ఉండదు కుంగి కృశించి నశించిపోతారు  ఇది శాపం కాదు  శాస్త్రం  జీవనాధారం లేకుండా ఏ జీవి అయినా జీవిస్తున్నదా ఈ ప్రపంచంలో. వంట పని అంటే ఏమిటో మీకు తెలుసునా అది ఎలా చేయాలి  ధ్యానంగా మనం గాలి పిల్చేటప్పుడు, వదిలేటప్పుడు దాని మీద ఎంత శ్రద్ధ పెడతామో అంత శ్రద్ధగా ఈ పని చేయాలి  భక్తితో కనక ఈ పని చేయకపోతే ఆ వంట మొత్తం మాడిపోతుంది భక్తి అంటే అంకిత భావం  సరైన సమయంలో సరైన పనులు చేయకపోతే అన్నం మొత్తం మాడిపోతుంది ఎవరూ తినడానికి వీలు ఉండదు  ఇది తన దిన చర్యలో భాగం  ఏ రోజు వంట లేకపోయినా ఆ రోజు పస్తు ఉండడం ఖాయం.
వంట  కళాత్మకమై కంటికి ఇంపుగ లేకపోయినట్లైతే తినడానికి మనసు అంగీకరించదు  విజ్ఞానంతో కూడింది  ఏది సమపాళ్లలో లేకపోయినా  ఆ పదార్థం మొత్తం ఎందుకు పనికిరాకుండా పోతుంది  ప్రేమగా గనక  గృహిణి ఆ పదార్థాన్ని చేయకపోతే రుచిపచి లేకుండా పోతుంది.  అనుభూతి చెంది మరీ చేయాలి  నా కుటుంబానికి నేను  బానిసగా చేస్తున్నాను అన్న భావాన్ని వదిలేసి  సేవాభావంతో చేస్తుంది  కనుకనే దానికి అంత విలువ పెరుగుతుంది  గౌరవం విలువ తెచ్చేది ఈ విషయాల్లోనే  కనుక  ఈ విషయాలన్నీ సమగ్రంగా తెలిసిన ఏ వ్యక్తి గృహిణిని వెటకారంగా మాట్లాడడు. నిజానికి ఒక్కొక్క కళలో ఒక్కొక్కరు నిష్ణాతులు ఉంటారు  ఈ గృహిణి వంటశాస్త్రంలో కళాత్మకంగా చేస్తూ  అందరి మన్ననలను పొందుతుంది  ఇప్పుడు చెప్పండి  ఆమె చేసే పని తక్కువా మీరు చేసే పని తక్కువా  వెంటనే పోల్చుకుని ఆమె విలువలు పెంచండి  మరింత మృదుమధురంగా ఆనందంగా చేసేలా  ప్రోత్సహించండి తప్ప  వెటకారాలు మానండి.కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం