చలసాని రామకృష్ణ గారు వచ్చిన తర్వాత వామపక్ష భావాలకు వారు ఎందుకు ఆకర్షితులయ్యారు. తమ కుటుంబ సభ్యులలో పెద్దవారు ఎవరైనా ఆ పార్టీలో ఉన్నారా లేక మీరే ప్రథములా అని ప్రారంభించి వామపక్ష పాతులలో ఏ సిద్ధాంతం మీకు బాగా నచ్చి ఆకర్షితులై జీవితాన్ని కూడా దానికోసం వెచ్చించారో వివరించమంటే ఆర్థికంగా నైతికంగా సామాజికంగా అందరినీ సమదృష్టితో చూడడం ఒకరు గొప్ప మరొకరు తక్కువ అన్న భావం లేకుండా ప్రతి ఒక్కరిని కామ్రేడ్స్ గా అంటే సోదరులుగా భావించి వారు కూడా తమ కుటుంబ సభ్యులే అనుకుని జీవించాలన్న ఆశయం నాకు బాగా నచ్చింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ వారి స్వార్థ రాజకీయాలను ఎదిరించడానికి సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రతి ఒక్కరిలో ఆలోచనా శక్తిని పెంచడానికి కృషి చేశాం అని చెప్పారు నాకు చాలా ఆనందం వేసింది.
ఏదైనా ఒక ఉన్నత కార్యక్రమాన్ని చేయాలని తలచినప్పుడు దానికి తగిన ఆలోచన చేయాలి ఎక్కడైనా ఏ ప్రాంతమైన అక్కడివారు విద్యాబుద్ధులతో ముందుకు సాగాలంటే ఆ గ్రామానికి తప్పకుండా విద్యాలయం గ్రంథాలయము ఉండి తీరాలి విద్యాలయంలో ఊరికే పాఠాలు చెప్పడం కాకుండా ప్రస్తుతం జరుగుతున్న విషయాలన్నిటినీ పిల్లలకు అవగాహన జరిగేట్లుగా జీవితంలో వారి నడవడికను తీర్చిదిద్దడానికి అవసరమైన పద్ధతులను భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఉపాధ్యాయుడు సందర్భాన్ని బట్టి తెలియజేసినట్లయితే వారు చదివిన చదువు సార్థకమవుతుంది. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దబడతారు. అది లేకుంటే పిల్లలు కంఠస్థం చేసిన దానిని అప్పజెప్పడం వరకే పరిమితమై ఉంటారు.
అలాగే గ్రంథాలయం ఏర్పాటు చేయడం పెద్ద సమస్య కాదు ప్రజల సహకారం కావాలి ముందు ఆ గ్రంథాలయంలో ప్రతి నిత్యం ప్రధాన పత్రికలు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే దేశ స్థితి గతులు ఏనాటివి ఆనాడు వారు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా పిల్లల కోసం చేయాలన్న తపనతో చిన్నతనంలోనే మంచి అలవాట్లను నేర్పాలన్న సదాశయంతో భాస్కర్ ఈ కార్యక్రమానికి పునాది వేశారు అయితే వారి కోసం ఎలాంటి గ్రంథాలను మనం ఎన్నిక చేయాలి అన్నది ప్రధాన సమస్య. వారికి పెంచవలసినది మనసునా? బుద్ధినా? మనసును ఉల్లాసంగా ఉంచడం కోసం చిన్నపిల్లల కథల పుస్తకాలను తెప్పించుకోవాలి. బుద్ధిని పెంచడానికి డిటెక్టివ్ గ్రంథాలు ఏర్పాటు చేయవచ్చు అంటూ నలుగురితో ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు.
మా ఆత్మీయుడు భాస్కర్ (13)ఏ.బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి