జగతికి వెన్నెముక స్త్రీ (14);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఆ నీళ్ళు పోయగానే ఆ బిడ్డ  స్నానం అయిపోయిందనుకుంటుంది కానీ  అమ్మ మాత్రం అప్పుడే ప్రారంభమైంది  అన్నట్లుగా ప్రవర్తిస్తుంది ఈ కుంకిడి కాయ రసం శరీరం మీద పడినప్పుడు  దాని నురుగు శరీరం మీద అంటుకుని ఉంటుంది  అభ్యంగన స్నానము అంటేనే ప్రతి అంగమును శుభ్రము చేయుట కోసం చేసే స్నానము  అని అర్థం. అప్పుడు తల్లి సున్నిపిండి తీసుకొని దానిని నూనెలో కలిపి నలుగు పెట్టినట్లుగా శరీరం మొత్తం రుద్ది రుద్ది ఎలాంటి రోగ క్రిములు మనకు తెలియకుండా లోపల దాగి ఉన్నా వాటిని కూడా బయటకు తీసుకువచ్చేలా  బిడ్డకు ఎలాంటి  హాని కలిగించే క్రిములు ఉండకూడదు అన్న లక్ష్యంతో  స్నానం చేయిస్తుంది మళ్లీ ఆ సున్నిపిండి మొత్తం శరీరం నుంచి  బయటపడే అంతవరకు మళ్ళీ రుద్దుతుంది
అప్పటికీ స్నానం అయినట్టు లెక్క కాదు చేతి వేళ్లకు,  కాలివేళ్లకు  మధ్యనున్న  దుమ్మును పిల్లలు లెక్కించరు  స్నానం చేశాను కదా నీళ్లు పడగానే అక్కడ శుభ్రం అయిపోతుంది అన్న ఆలోచనలో వాడు అలా చేస్తాడు  కానీ అమ్మ అలా కాదు  అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో  ఏ ఒక్క క్రిమి లేకుండా ఉండేలా  సున్నిపిండితోనూ  ఆ పిండి వాసన రాకుండా ఉండే అంతవరకు  నీళ్ళతో కడిగి పరిశుభ్రంగా ఆ బిడ్డను లోపలికి తీసుకొస్తుంది  ఆడపిల్లలకు జుట్టు ఉంటుంది కదా ఆ తువ్వాలుతో తుడిచినంత మాత్రాన ఆ తడి ఆరిపోదు. అందువల్ల అమ్మ ఏం చేస్తుందంటే  కొన్ని నిప్పులు తీసుకొని దానిమీద  బిడ్డకు తెలియని ఒక పొడి సాంబ్రాణిని వేసి ఆ పొగ జుట్టు లోపలికి వెళ్లేలా ఏర్పాటు చేస్తుంది. దానితో తడి ఆరిపోవడంతో పాటు  ఆ లోపల ఉన్న క్రిమి కీటకాలన్నీ కూడా నశించిపోతాయి. అదీ అమ్మ చేయించే స్నానం.
ఇంక చివరి ఘట్టం వస్త్రధారణ  పిల్లలకు ఎలా ఉంటుంది ఏదైనా వారికి నచ్చిన బట్టలు ఉంటే వాటిని రెండు రోజులు మూడు రోజులైనా వరుసగా ధరిస్తారు  కానీ అమ్మకు అది ఇష్టం ఉండదు ఏ రోజుకారోజు కొత్త బట్టలు వేసుకుని తీరవలసినదే  నిన్న వేసుకున్నదే వేసుకుంటానని వాడు గారాం చేసినా నిన్న వేసుకున్నావు కదా  చెడ్డ క్రిములు చాలా ఉంటాయి అది  నీకు జబ్బులు రావడానికి కారణం అవుతాయి అందుకని ఇది వేసుకో రేపు అది వేసుకుందువు గాని ఈలోపు దానిని ఉతికిస్తాను అని నచ్చ చెపితే కానీ  ఆ బిడ్డ అంగీకరించదు ఇంత చేయడానికి ఎంత సమయం పడుతుంది ఆమెకు ఎంత ఓర్పు ఉండాలి  బిడ్డ పని ఒకటే కాదు కదా పెద్దల పని కూడా ఉంటుంది. దానిని కూడా చూసుకోవాలి. అష్టావధానం చేయడం ఎంత కష్టమో  అమ్మ చేసే ఈ పని అంతకుమించిన కష్టం. అది గ్రహించిన రోజున ఆమెకు పాదాభివందనం చేయక తప్పదు. అందుకే అమ్మకు అమ్మ తప్ప మరొకరు పోలిక లేదు అని మన పెద్దలు చెప్పడం.కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం