పాపం పడతి (14);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టిన  అమ్మాయికి  వారింట్లో  ఆమె ప్రవర్తించిన పద్ధతికి, ఇక్కడ పద్ధతికి సంబంధమే కనిపించదు. ప్రతిదీ చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది  ఏ మొహమూ తనకు పరిచయం లేదు అత్త ఎవరో, మామ ఎవరో తెలియదు. భర్తను మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటుంది  ఎంతమంది వారి సంతానం వారు ఏం చేస్తున్నారు వారి ప్రవర్తన ఏమిటి దీని గురించి ఆమెకు ఏ అభిప్రాయం లేదు  వారు పలుకరిస్తే ఎలా సమాధానం చెప్పాలి,  వారు పెద్దవారా చిన్నవారా  సాత్వికులా కాదా ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకునే మనసుతో ఉన్నరా లేదా అనే విషయాలను  తెలుసుకోవాలంటే కొన్ని రోజులు గడవాలి. వారు ఎలా ప్రవర్తిస్తారో దానిని గ్రహించి ఆమె వారి గుణగణాలను అంచనా వేసి దానికి అనుగుణంగా ఆమె ప్రవర్తించాలి. భర్తది ఎలాంటి మనస్తత్వం ప్రతిదానికి చిరాకుపడతాడా అన్నిటిని సమర్ధించుకుంటాడా అన్న విషయం తెలియదు.
ఆమె వచ్చిన విషయం ఆ గ్రామస్తులకు అందరికీ తెలిసి ఆమెను చూడడానికి  అనేకమంది వస్తారు పిల్లలు పెద్దలు  వారు ఎవరు  ఈ కుటుంబానికి ఆ కుటుంబాలకు ఉన్న సంబంధాలు ఏమిటి  వచ్చిన వారు మాట్లాడుతూ ఉంటే వారితో ఏ వరుస   కలపాలి అన్న విషయాలు కూడా తనకు తెలియదు కొంతమంది చాలా చొరవగా ఇంతకుముందే చాలా కాలంగా తమతో స్నేహం ఉన్నప్పటిలా దగ్గరగా మాట్లాడతారు  కొంతమంది అంటీ అంటనట్లుగా ఉంటారు వారు ఏ ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానాలు  చెప్పుకుంటూ  ముసిముసి నవ్వులతో కాలక్షేపం ఒక్కటే మార్గం అని నిర్ణయించుకొని  అలా చేయడం వల్ల వచ్చిన వారికి ఈ అమ్మాయి మీద మంచి అభిప్రాయం కలుగుతుంది.
అత్త మామలతో చాలా అణకువగా ఉండు ఏ విషయంలోనూ నీకు నచ్చకపోయినా ఎదురు చెప్పవద్దు  దీనికి సంబంధించిన కారణాలను అడగవద్దు. ఇక్కడ నా దగ్గర మీ నాన్నగారి దగ్గర  ఎలా జీవితాన్ని కలిపావో దాన్ని జ్ఞాపకం పెట్టుకో ఇది  సొంత ఇల్లు కాదు  అత్తవారిల్లే నీ సొంతం. అక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా దానికి బాధ్యత వహించవలసినది నీవే కనుక ఎలాంటి పొరపాట్లు   లేకుండా మంచిగా ఆలోచన చేస్తూ చేయవలసిన బాధ్యత నీ మీద ఉంటుంది. కనుక నన్ను మీ నాన్నను ఎలా  ప్రేమగా చూసుకుంటూ  ఆనందంగా కాలం గడిపావో అక్కడ అత్త మామలతో కూడా అలాగే ప్రవర్తించాలి  ఈరోజు నుంచి వారే నీకు తల్లి తండ్రి అన్నీ అని కౌగిలించుకుని అశ్రు నయనాలతో  కన్నతల్లి అప్పగింతలు పెడుతుంది. అమ్మ చెప్పిన పద్ధతిలోనే నడుస్తుంది ఆ నూతన వధువు.


కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం