మా ఆత్మీయుడు భాస్కర్ (15)-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 గాంధీ గారు చనిపోయిన రెండు నెలల లోపే 1948 వ సంవత్సరంలో  వారి శిలా విగ్రహాన్ని ముదునూరులో  ప్రతిష్టించారు. ముదునూరులో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి  సమాజం కన్నా ముందు నడపాలన్న అభిప్రాయంతో ప్రతి ఒక్కరిలో  మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన అన్నే సుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని స్థాపించారు గ్రామ అభివృద్ధికి ఎన్నో రకాలుగా సహకరించి సాయపడిన  కాకాని వెంకటరత్నం గారి విగ్రహాన్ని  1978 వ సంవత్సరంలోనే  ప్రతిష్టించారు  రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి గార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి. విప్లవాత్మక భా
వాలతో సమాజాన్ని ముందుకు నడిపిన అన్నే అంజయ్య గారి  గుర్తుగా వారి  విగ్రహాల్ని ఏర్పాటు చేశారు.
ఆశయాలకు ఆదర్శంగా జీవించే ఏ వ్యక్తిని  దేశం ఆదరించదని అనేక సందర్భాలలో రుజువు అయ్యింది. నాగులపల్లి కోటేశ్వరరావు గారు, ఎలమంచిలి రామకృష్ణ గారు  వీరిద్దరూ వామపక్ష భావాలకు కట్టుబడి  సమాజానికి ఎంతో ఉపయోగపడే  ఆదర్శాలతో ముందుకు దూసుకు వెళుతున్న  సమయంలో  
1950వ సంవత్సరంలో  వారిని బలి తీసుకున్నారు  వారి సేవలను గుర్తించి ముదునూరు గ్రామస్తులు వారిద్దరి పేరుతో స్తూపాలను ఏర్పాటు చేసి నేటికీ వారి ఆదర్శలను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. మనిషిని చంపగలరు తప్ప మనసులను వారి లోని మంచితనాన్ని ఎవరు కూడా చంపలేరు ఈ ప్రపంచంలో  అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలను చూసినప్పుడు.
అయితే కొంతమంది కనిపిస్తుంది  ఇక్కడ అడ్డుగా ఈ విగ్రహాలను ఎందుకు పెట్టారు దాని వల్ల తెలిసేది ఏమిటి అని. నిజం. దేశానికి గాంధీ మహత్ముడు చేసిన సేవలు ఎలాంటివో ప్రజలకు తెలుస్తుంది కానీ  మన గ్రామంలో మన కోసం చేసిన పెద్దల  పనులు ఏ ఒక్కటీ మనకు జ్ఞాపకం ఉండవు  కారణం అలక్ష్యం. వాటిని చేయమని ఎవరు అడిగారు. వారి అవసరం వల్ల వారు చేశారు  అనేవారు కొంతమంది ఉంటారు. కాదు ఉన్నారు. వారికి తెలియని ఒకే ఒక విషయం ఈ దేశంలో కానీ గ్రామంలో కానీ  పెద్దల త్యాగాలు లేకపోతే ఆ దేశం ముందుకు వెళ్ళదు అని తెలియాలి  అది జ్ఞాపకం చేయడం కోసం ఈ విగ్రహ స్థాపనలు  వారిని చూసిన తర్వాత నైనా వీరు ఎవరు? ఏమిటి? ఎందుకు  వీరి విగ్రహం ఇక్కడ ఉన్నది అని ఆరా తీస్తే అసలు విషయం తెలుస్తుంది  దానిమీద ఆసక్తి పెరుగుతుంది  దానితో ఆ వ్యక్తికి  తన హృదయంలో  ప్రముఖ స్థానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు... దానితో గ్రామంలో ఏదో ఒక మంచి పని చేయాలన్న ఆలోచన పుట్టుకొస్తుంది.

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం