తిరుప్పావై ~15 వ పాశురము; సి మురళీమోహన్
భక్తులను మేల్మొలుపుట వ్రత పూర్వభాగము. ఈ పాశురముతో చివరి ~ అంటేపదవ గోపికను మేల్కొలులుతూ ఉంది గోదమ్మ తల్లి. ఈ పాశురములో‌ ఇంకాపడుకునే ఉన్న గోపికకూ గోదమ్మకూ మధ్య జరిగిన సంవాదమిది)

ఎల్లే యిళఙ్గిళియే యిన్నమ్ వురఙ్గుదియో
శిల్ ఎన్ఱు అழை యేల్ మిన్ నఙ్గై మీర్ పోదరుగిన్ఱేన్
వల్లై వున్ కట్టురైగళ్ పణ్డే వున్ వాయ్ అఱిదుమ్
వల్లర్ గళ్ నీఙ్గళే నానేదాన్ అయిడుగ
ఒల్లై నీ పోదాయ్ వునక్కెన్న వేఱుడైయై?
ఎల్లారుమ్ పోన్దారో? పోన్దార్ పోన్దు ఎణ్ణిక్కొళ్
వల్లానై కొన్ఱానై మాற்றாరై మాற்றழிక్క వల్లానై
మాయనై ప్పాడ ఏలో రెంబావాయ్!
  
ప్రతిపదార్థాలు:
 
ఎల్లే యిళఙ్గిళియే ~ ఏమమ్మా! ఓ లేత చిలుకా!

యిన్నమ్ ఉరంగుదియో ~ ఇంకా నిద్రించుచున్నావా? 

శిల్లే ఎన్ రు అழைయేన్మిన్ ~ జిల్లుమని పిలువవద్దండి!

నఙ్గై మీర్ ~ మీరు గొప్పవారు;

పోదరు గిన్ఱేన్~ నేనూ వస్తూనే ఉన్నాను;

వల్లై ఉన్ కట్టు ఉరైగళ్~ నీవు సమర్థురాలవు (నీ గడుసుమాటలు మాకు 
తెలియదా?);

పణ్డే ఉన్ వాయ్ అఱిదుమ్ ~ నీ నోరు ముందే మేము ఎరుగుదుము కదా!

వల్లర్ గళ్ నీఙ్గళే ~ సమర్థురాండ్రు మీరేలే!

నానేదాన్ ఆయుడుగ~ నేనే అగుదును గాక;

ఒల్లైనీ పోదాయ్ ~ నీవు త్వరగా రమ్ము;

ఉనక్కెన్న వేరుడైయై ~ నీకు వేరే అనుభూతి ఎందుకు?

ఎల్లారుమ్ పోందారో ~ అందరునూ వచ్చినారా?

పోందార్ పోందెణ్ణి కొణ్ ~ వచ్చినారు వచ్చి ఎంచుకో;

వల్లానై కొన్ఱానై~ కువలయాపీడమనే బలమైన ఏనుగును చంపిన వాడు;

మాற்றாరై మాற்றழிక్కు ~ శత్రువుల మదాన్ని అణచగలిగిన;

వల్లానై మాయనై ~ సమర్థుడైన, ఆశ్చర్యకరమైన చేష్టలు కలవానిని గూర్చి; 

పాడేలో రెంబావాయ్ ~ కీర్తించుటకు లేచిరావమ్మా!
 
తాత్పర్యము:
 
ఏమే ఇంతవరకూ ‌నిద్ర లేవకుండా ఉన్నావు? అందరికన్నా ముందే లేచి మిమ్ములను అందరినీ నేనే లేపెదను అని ఘనముగా వైభవోపేతముగా
మనమంతా నోము నోచుకోవాలని ఏమేమో బీరములు పలికినావే 
మేము వచ్చి నీ ఇంటిముంగిటనిలిచి నిన్ను పిలుచుచున్నా లేచి
రాకున్నావు. వట్టి చిలుకపలుకులు పలికెదవే కీరవాణీ! మాట నిలుపుకోకపోతివి. పోనీ ఇప్పుడైనా త్వరగా రావే?  అ‌ని‌ పిలుచు వారికి ~ ఆ గోపిక 

గట్టిగా అరవకండి ~ ఎత్తి పొడవకండి. 

ఇప్పుడే వస్తాను.  అని‌ ఆ గోపిక బదులిస్తే ~ బయట ‌నిలుచున్నవారు 

ఎంత గడుసరివే నీవు ~ కానిమ్ము నీవూ నీ మాటలు మాకు కొత్తవి కావులే అని అన్నారు. దా‌నికి గోపిక ఇలా బదులిచ్చింది,

మీరే గడుసువారు. పోనీ నేనే గడుసుదాన్ని లేండి, దాని కేమి? ఇప్పుడేమిచేయమందురు?   బయట ఉన్నవారు, 

ఏకాంతసౌఖ్యానుభూతితో ప్రొద్దు తెలియక ముతియ
చున్నావు. సమిష్టి ఆనందముకన్నా ఏకాంత భోగము నీకు ఆనందకరమా?మాతోబాటు కలిసి కువలయాపీడనమును పీచమడచిన, ముష్టికాసుర, బాణాసుర సంహర్తను మాయామానుష విగ్రహుని కీర్తిద్దాము రావే*  అని అన్నారు.  దానికి ఆ గోపిక, 
వస్తాను కానీ నేనొక్కదాననేనా రానిదానను?
మిగిలిన వారందరూ వచ్చినారా? అని అన్నది.  బయట 
ఉన్న వారు ఇలా బదులిచ్చినారు: 

వట్టిమాటలతో సరిపెట్టుచున్నావు,  కానీ పడక విడిచి లేచి రాకున్నావు. ఎవరే నిన్ను రానీయక ఆపినది?
ఎంత స్వార్థపరురాలవే నీవు? అందరూ వచ్చినారని
చెప్పినా లేచిరాక కుంటి ప్రశ్నలేస్తున్నావు  మా మాటమీద నమ్మకము లేకున్నచో నీవే వచ్చి ఎంతమంది వచ్చినారో లెక్కించుకోమ్మా?  అని అన్నారు‌.
  
వ్యాఖ్య: (శ్రీ కందాడై రామానుజాచార్యుల వ్యాఖ్య ఇది):
 
 ఇక్కడ చిలుక అంటే భగవత్సారూప్యమునందిన ఆచార్యుడు. ఇక్కడ 
కువలయాపీడనము అంటే భూమండలమును పీడించు అహంకారము. 
చాణూరముష్టికులు అంటే కామక్రోధాలు. ఈ పాశురములోభాగవతగోష్టిలో భగవంతుని రాకకూడా అంతరాయముగాభావించబడునని  చెప్పబడుచున్నది. 
అందుకే చివుక్కుమన్నట్లు పిలువవద్దనిరి. ఆచార్యుని వాక్యమే శిష్యులను ఉద్దరించునది‌. నేనే పూర్ణురాలని అంగీకరించుటచే భాగవతోత్తములు పలికినదానికి చేతులు జోడించిశిరస్సు వంచి ఆమోదించుటే ధర్మమని అర్థము. గోష్టిని వదలి ఒంటిగా ఉండరాదు‌.ఏ భక్తుడు రాకున్ననూ కొరతనే  అందరూ వచ్చినారా అ‌ని సూచించబడినది ఇక్కడ. వచ్చి లెక్కించుకొ‌నుము అన్న పలికినదానితో భాగవతోత్తముల దర్శనము స్పర్శనము సంభాషణము అవిచ్చిన్నముగా కొనసాగవలయునని కోరుట‌!
 
 ఇందులో తిరుమంగై ఆళ్వార్లను మేల్కొలుపుచున్నారు‌. చిలుక మనము పలికినదానినే పలుకుతుంది.‌ నమ్మాళ్వార్లు చేసిన ప్రబంధములోని శ్రీసూక్తులనే వీరు 
సాయింవినారు. అలాగే  ఉనక్కెన్న వేరుడైయ   వీరికున్న శిఱియతిరుమడల్, పెఱియ తిరుమడల్ అను రెండు ప్రబ‌ధముల
వైలక్షణమే వీరి వైలక్షణ్యము.
ఎల్లారుమ్ పోందారో  వీరికి ముందే ఆళ్వారులందరూ అవతరించినారు.‌ కనుక వీరినేమేల్కొలుపు 
తున్నారనేది పూర్వాచార్యుల సిద్దాంతము.‌
 స్వామి తిరువాయ్ మొழி ని నాకు సంత చెప్పి నాచే పలికించినారని ~ కావున, వీరు చిలుకనే కదా! ఆళ్వారులందరిలో వీరే చిన్నవారు. కనుక ఇళంగిళియే సరిపోతుంది. నమ్మాళ్వారులు 16 సంవత్సరాలు నిద్రించినారు కనుక  ఇన్న్ం ఉరంగుదియే అనేది కూడా వీరికి సరిపోతుంది.  నంగైమీర్ కూడా సరిపోతుంది.

దీని అనువాద సీస పద్య రచయిత కీ.శే.కుంటిమద్ది శేషశర్మ గారు:
 
ఎందాక నిద్రింతుతవువే?  లేతకీరమా!
వరవర్ణినులు మీరు దురుసు పల్కు
లాడబోకుండిదే యరుగు దెంచితి నేను;
గట్టిదానవు ; నీదు గడుసుమాట
లన్ని న్ను మే మెల్ల మున్నే యెరుంగుదు
మతివ! మీరల దిట్ట నగుదుగాక
నేను యేమందురు? నీవొక్కతే వేరు
భోగసౌభాగ్యమ్ము పొందనేల?
 
అరుగుదేరుము వేగిర; మంద రరుగు
దెంచిరే? వచ్చి రేతెంచి యెంచికొనుము
మత్త మాతంగ సంహర్త మాయలాని
రమ్ము గీర్ర్తింప దుర్దమారాతిఘాతి!

ఆణ్డాళ్ దివ్య తిరువడిగళే శరణమ్

కామెంట్‌లు