స్వాతంత్య్ర ఉద్యమం లో పాల్గొన్న తొలి వన్నియకుల క్షత్రియ మహిళ అంజలై! ఆరున్నర ఏళ్ళు జైల్లో గడిపారు.5వక్లాస్ వరకే చదివారు. భర్త మురుగప్ప పత్రికల ఏజెంట్. తమ ఇల్లు పొలాలు అమ్మి స్వాతంత్ర్య ఉద్యమం కోసం ఖర్చు పెట్టారు ఆదంపతులు!
1927 మద్రాస్ లోని బ్రిటిష్ అధికారి జార్జిస్మిత్ నీల్ విగ్రహాన్ని తొలగించాలని తన 9ఏళ్ళ కుమార్తె తో సహా ఆందోళన చేశారు. ఆఇద్దరినీ జైల్లో పెట్టారు. గాంధీజీ వచ్చి ఆమె కూతురు అమ్మకన్ను అనే పేరుని లీలావతి గామార్చి తనతొ వార్ధా తీసుకుని వెళ్లారు. 1931 లో ఆరునెలల గర్భవతి ఐన ఆమెను జైల్లో పెట్టారు. బెయిల్ పై బైట కి వచ్చి మగబిడ్డను కని తిరిగి 15 రోజులకే జైలు కెళ్ళారు.స్వతంత్రం వచ్చాక మద్రాసు శాసనసభ కు ఎం.ఎల్.ఎ.గా ఎన్నికైనారు.తన71వ ఏట స్వర్గస్తురాలైన ఆమెని గూర్చిన పాఠం తమిళనాడు 8వక్లాసు పుస్తకం లో ఉంది. ఇప్పటికీ కడలూర్ లో ఆమెను స్మరించుకోవటం విశేషం!🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి