మా ఆత్మీయుడు భాస్కర్ (3)-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.


 ఆ రోజుల్లోనే భాస్కర్ కి  సమాజ సేవ పైన  మక్కువ పెరిగింది  పేద విద్యార్థులకు  సాయం చేయడం  పుస్తకాలు కొనలేని వారికి  తానే కొనడం లాంటివి అనేకం చేశారు  ఆ వయసులో తాను చేసిన గొప్ప పని వారి గ్రామం ముదునూరు లో  భారత్ సేవక్ సమాజ్  కాకాని వెంకటరత్నం గారు  మంత్రిగా ఉన్న సమయంలో  భాస్కర్ సలహాతో  ఆ పేరు  మీద కార్యక్రమాలు చేయడం ఎలా చేయాలి  అన్న ప్రతిదీ  భాస్కర్ చెబుతూ ఉండేవాడు  నేను ముదునూరు పరిసరప్రాంతాలు చూడడం మొదటిసారి  మా తేలప్రోలు పరిస్థితి ఎలా ఉందో  ముదునూరు పరిస్థితి కూడా అలాగే ఉంది  అసలు ఏ గ్రామమైనా ఇలాగే ఉంటుందేమో అని ఆ రోజున  ఒక నిర్ణయానికి వచ్చాను  కార్యక్రమం పూర్తయ్యేంతవరకు  ప్రతిరోజు  అక్కడ చేయవలసిన ప్రతి  పని దగ్గర ఉండి చూసుకునే వాడు భాస్కర్. కాకాని వెంకటరత్నం గారు  కలపాల సూర్యప్రకాశరావు గారు భాస్కర్ తండ్రి  సీతారామయ్య గారు  అజమాయిషీ చేస్తూ ఎవరికి ఏ లోపం లేకుండా  చూస్తూ ఉండేవారు. అక్కడ భాస్కర్ చేసిన పనుల్లో నాకు నచ్చింది  ఒక  హోమియో వైద్యులు  24 గంటలు మాతోనే ఉండేవారు. ఉదయం యోగా చెప్పడం కోసం ఒక మాస్టర్ ని ఏర్పాటు చేశారు  యోగ ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి ఈ పద్ధతులను అన్నిటిని కూలంకషంగా చెప్పి అక్కడ ఉన్నన్ని రోజులు ఆయన మాకు తండ్రిలా సలహాలిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు  అప్పట్లో  ఉదయం బయటికి వెళ్లడానికి సమస్య. అందువల్ల ఏం చేశారంటే  మేము ఉంటున్న దానికి దగ్గరలో  గాంధీ గారి పద్ధతిలో  చిన్న గోతిని తీసి దాని మీద మట్టి పోయడం అదేదో కొత్త పద్ధతి అనిపించింది  దానివల్ల ఎలాంటి చెడు ప్రభావము ఉండదు  అని మాస్టారు చెప్పేవారు. భోజనాలు అయిన తరువాత  నిద్రపోకుండా  కొంచెం చల్లబడిన తర్వాత  ఆ గ్రామ వాసులను కలవడం  ఫలానా ఇంటికని కాదు  ఎవరు ఏ ఇంటికి వెళితే వారు అతనికి ఆ గ్రామ పరిస్థితులను  అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం. దానితో భారతదేశపు పటం మన మెదడులో ఉండిపోతుంది. సామాన్యుడు అతి సామాన్యుడు ఎలా జీవిస్తున్నాడు ఆ జీవన విధానం  ఆ వయస్సులో పరిచయం చేయడం విశేషం. ఇలాంటి మంచి పనులు కాదు గొప్ప పనులు చేయించే ప్రణాళికలు ఏర్పాటు చేయడం  భాస్కర్ కు ఆరోజుల్లోనే వెన్నతో పెట్టిన విద్య. ఆ రోజుల్లో ఆటలు అందరిలోనూ సమైక్యత ఏర్పడాలన్న దృష్టి. ఒక గంట సేపు సాహిత్యం  చిన్న చిన్న కథలు గానీ, కవితలు కానీ, హాస్యోక్తులు గాని ఎవరికి ఏది తెలిస్తే అది చెప్పడం. ముదునూరు లో ఉన్నన్ని రోజులు కూడా ఏదో ఒక రోడ్డు వేయడానికి వచ్చిన కూలీలు లాగా కాకుండా  విహారయాత్రకు వెళ్లి అనేక విషయాలు తెలుసుకోవడానికి  అవకాశం వచ్చినట్లుగా  మేమందరం భావించాం.


కామెంట్‌లు
Dr. T. V. Chalam చెప్పారు…
Really great sir Anand garu.That Bhaskar is not only agreat social worker,but also a grat patriat.Our country and bublic should remember him forever.Thank you Anand garu for giving me this opportunity to know about him.I feel in each and every village needs so many such Bhaskars.