కోటి రెడ్డి గారు పదవీ విరమణ చేసి వారి స్వగ్రామానికి వెళ్లి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ప్రశాంత జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఎప్పుడైనా ఆయన కనిపించినట్లయితే పదిమంది కూర్చుని ఉన్నా రెడ్డి గారు మాత్రం లేచి నిలబడి వారికి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటే అందరూ కూర్చునే ఉన్నారు కదా నువ్వు కూడా కూర్చోవచ్చు కదా అన్నప్పుడు శివ నాగిరెడ్డి గారు బాగుంది మాస్టారు నాకు మాస్టారు మీరు ఒక మంచి వ్యక్తిగా జీవితానికి వెలుగు చూపిన ఆదర్శమూర్తి కంటికి కనిపించినప్పుడు కనీస మర్యాద కూడా లేకుండా ప్రవర్తించమని మీరు మాకు ఏనాడు చెప్పలేదు మాస్టారు అందుకే మీరంటే గౌరవము ప్రేమే కాదు భక్తి కూడా. మీరు చెప్పిన ఏ మాటను ఈ క్షణం వరకు నేను మర్చిపోలేదు నా జీవితంలో మీ మాటల వల్ల ఎంతో తృప్తికరమైన జీవితం లభించింది నాకు. జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను మాస్టారు అని అతను చెప్పినప్పుడు మాస్టారు కూడా కౌగిలించుకొని వీపు పై చేయి వేసి నిమిడినప్పుడు తన జీవితం ధన్యం అయింది అనుకున్నారు రెడ్డి గారు. శివ నాగిరెడ్డి గారిని గురించి రాయడం అన్నది అనుకోకుండా జరిగినది వారితో నాకున్న పరిచయం వారు చేస్తున్న పనులకు ప్రత్యక్ష సాక్షిని అనేక విషయాలలో సారూప్యమున్నవాడిని ప్రసంగవశాత్తు వారు చెప్పిన విషయాలను, ప్రత్యక్షంగా నేను చూసినవి, వారి మిత్రుల వల్ల తన చిన్ననాటి చిలిపితనాన్ని వారికి సంబంధించిన ఉపాధ్యాయుల మంచితనాన్ని అన్నిటినీ సమగ్రంగా తెలుసుకొని కొంతవరకు కృత కృత్యుణ్ణి అయ్యాను మా అమ్మాయి డాక్టర్ స్వాతి నీలం సంపాదించిన కొన్ని ఆధారాలను దీనిలో పొందుపరిచి వ్రాయబడిన పుస్తకం ఇందులో నాకెంతో సహకరించిన మా బంగారు తల్లికి తండ్రిగా నా ఆశీస్సులు అమ్మాయి సహకారమే లేకుంటే దీని స్వరూపం ఇలా వచ్చి ఉండేది కాదు.
వ్యక్తిగతంగా బుద్ధుని బోధనలను పూర్తిగా అవగాహన చేసుకున్న వ్యక్తి ఏ ఉద్దేశంతో బుద్ధ భగవానుడు తపస్సు చేసి నిజాన్ని తెలుసుకున్నాడు తర్వాత పరిణామాల వల్ల ఆనందుడు సుందరి లాంటి వాళ్ళ ప్రమేయంతో ఆ ఆశ్రమం ఎలా తయారయిందో మొత్తం చరిత్ర పూస గుచ్చినట్లు చెప్పగలిగిన చరిత్ర తెలిసినవాడు.ఈయన మహాయాన హీనయానములను సమగ్రంగా విశ్లేషించ కలిగిన సద్విమర్శకులు మా వేదాంత సూరి గారు మొలక పత్రిక సంపాదకులు రెడ్డి గారిని గురించి మీరు ఎంత వ్రాసినా అది అసమగ్రమే అనడం నాకు కొండంత బలాన్ని చేకూర్చింది. అందుకు వారి పత్రికలో ప్రచురించడానికి అర్హత పొందడం నాకెంతో ఆనందం. అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (57)-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి