ప్రతిరోజు ఉదయం 10:30 నిమిషాలకు మీటింగ్ జరుగుతుంది. నిన్న, ఇవాళ, రేపు కార్యక్రమాల సమీక్ష చేస్తారు. అన్నపూర్ణ గురించి మొదట మాట్లాడిన వారు శ్రీ వాత్సవ అనబడే యండమూరి సత్యనారాయణ గారు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఒక మంచి వాచక శుద్ధి ఉన్న నటుడు దొరికాడు అనేసరికి బందా గారు లేచి అతనిని ఆకాశవాణికి పరిచయం చేసింది మా శిష్యుడు సుబ్బారావు నండూరి. కనుక ఆ సుబ్బన్నను ప్రశంసించాలి అని చెప్పి ఈ నాటకం నాకు మంచి సంతృప్తిని మిగిల్చింది అని ఈ రోజు నుంచి నేను నిర్వహించే ప్రతి నాటకంలోనూ ఆనందే కథానాయకుడు అని ప్రకటించడంతో మీటింగులో ఉన్న ప్రతివారు హర్షద్వానాలు పలకడంతో నాకెంతో తృప్తిగా ఉంది. రెండవ రోజు బందా గారు నన్ను పిలిచి నిజానికి రేడియోలో ఆడిషన్ లో పాస్ అయిన వారికి ముందు పదిహేను నిమిషాల నాటకం ఇచ్చి అది ఎలా చేశాడో చూసి తర్వాత 30 నిమిషాల నాటకం ఇస్తాం. అలా నాలుగైదు నాటకాలు ఇచ్చిన తర్వాత అతను మంచి నటుడు అన్న నమ్మకం మాకు కలిగితే అతనిని గంట నాటకంలో పిలుస్తాం. అతను మేము అనుకున్న పద్ధతిలో చేయలేకపోతే మళ్ళీ తిరిగి 15 నిమిషాలు నాటికకు వెళ్ళిపోతాడు. కానీ అది నీ విషయంలో రివర్స్ అయింది ఆడిషన్ లో పాస్ అవకముందే గంట నాటకం అవకాశం దొరికింది దాన్ని సద్వినియోగం చేసుకున్నావు కనుక ఈ రోజు నుంచి రేడియోకి ఏ మంచి నాటకం వచ్చినా దానిలో కథానాయకుడు నా శిష్యుడు అని చెప్పుకోవడానికి నాకు అవకాశాన్ని ఇచ్చావు అని పొంగిపోయారు ఆ క్షణాన వారి ఆమందానందం వర్ణనాతీతం.వారిని మించిన ఆనందం పొందిన వారు మా గురువు గారు నండూరి సుబ్బారావు గారు.
పద్మ శ్రీ బందా గారు (6);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి