చక్కని చేతిరాత;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఒక్క సంవత్సరమా రెండు సంవత్సరాలా నర్సరీ అంటూ ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ అంటూ డిగ్రీ అండ్ పీజీ అంటూ దాదాపు
రజతోత్సవం వరకు మన చదువులు నిర్విరామంగా సాగుతూనే ఉంటాయి. 
అయితే వయసును బట్టి, వారు చదువుతున్న తరగతిని బట్టి పిల్లల సామర్ధ్యాలను
కొలచే మాధ్యమాలే ఈ క్వార్టర్లీ, హాఫ్ ఎర్లీ, అండ్ యాన్యువల్లీ అనే పరీక్షలు అన్నీ కూడా. మా పిల్లవాడు బాగా చదువుతాడండి కానీ పరీక్షల్లో మార్కులు ఎందుకు తగ్గుతున్నాయో అర్థం కావడం లేదు అంటూ బాధపడే తల్లిదండ్రులు ఆలోచించవలసిన విషయం ఏంటంటే వారి చేతిరాత ఏ విధంగా ఉంది అనేది. 
చేతిరాత అందరికీ ఒకే మాదిరిగా ఉండదు కొంతమంది పిల్లలు చాలా గుండ్రంగా, తమ తమ అక్షరాలను తీర్చిదిద్దుతుంటే
కొంతమంది పొడవుగా, సన్నగా
రాస్తూ చక్కని ముద్రను చిత్రిస్తారు వారి నోట్ బుక్స్ లో. మరి కొంతమంది పిల్లలకి హ్యాండ్ రైటింగ్ అనేది సరిగ్గా కుదరదు చూసేదానికి కూడా అది కాస్త వికారంగా కనిపిస్తూ ఉంటుంది అందువల్ల వీళ్ళకి సాధారణంగానే మార్కులు హ్యాండ్ రైటింగ్ బాగా ఉన్న వాళ్ళతో పోలిస్తే తక్కువగానే
వస్తూ ఉంటాయి. అయితే పరీక్షల్లో మార్కులు రావడానికి మాత్రమే ఈ హ్యాండ్ రైటింగ్ అనేది అవసరమా! హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాకుంటే మార్కులు రావా అంటే...
లేదు లేదండి పరీక్షల్లో మార్కులకి హ్యాండ్ రైటింగ్ అనేది ఒక క్రైటీరియా మాత్రమే అదే ప్రధానమైతే కాదు పిల్లల విజ్ఞానమే 
విద్యాభ్యాసంలో పరిగణించబడేది. అయితే ఈ చేతిరాత సరిగ్గా కుదరకపోవడానికి కారణాలు మాత్రం వారి వారి చిన్నతనంలో తల్లిదండ్రులు వారి సమీపంలో ఉండి బాధ్యతగా వారి చేతిరాతలను సవరించకపోవడమే. చేతిరాత అనేది ఏదో పుట్టుకతోనే వచ్చే
గుణం ఏమీ కాదు. కాస్తంత అవగాహన పెరిగాక మన
అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి మనమెంచుకున్న విద్య అనే మార్గాన్ని సుగమం చేసుకునే
ప్రయత్నంలో అలవర్చుకున్న అలవాటు మాత్రమే.
కేవలం చేతిరాత విద్యాభ్యాసం లోనే కాదు మన ఆలోచనలను, భావాలను పొందుపరచుకునేలా ఉపకరిస్తుంది. పదిసార్లు చదవడం కాదు ఒకసారి రాస్తే ఆ చదివింది గుర్తుంటుందని చిన్నప్పుడు మన గురువులు, తల్లి దండ్రులు చెప్తూ ఉంటారు. గుడ్ హ్యాండ్ రైటింగ్
అనేది మన స్టేట్ ఆఫ్ మైండ్ ని కూడా వ్యక్తపరుస్తూ ఉంటుంది. అందుకే ఎవరైనా ఫోన్లో డిటెయిల్స్ చెప్తే, రాసుకున్నప్పటి హ్యాండ్ రైటింగ్, ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా రాసినప్పటి హ్యాండ్ రైటింగ్ కి చాలా తేడా ఉంటుంది. గాంధీ గారు చెప్పినట్టు "ఐ సా దట్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ షుడ్ బి రిగార్డడ్ యాస్ ఏ సైన్ ఆఫ్ యాన్ ఇంపర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ " (I saw that bad handwriting should be regarded as a sign of an imperfect education) అని. కనుక పిల్లల చేతి రాతలను అందంగా మలిచే బాధ్యతను తల్లిదండ్రులు, గురువులు చిన్నవయసులోనేస్వీకరిస్తే వారి కలలకు, లక్ష్యాలకు తోడ్పాటును అందించిన వారవుతారు అని నా అభిప్రాయం. ఒకసారి మీరు ఆలోచించండి... నచ్చితే తప్పక ఆచరించండి...


కామెంట్‌లు