ఏ ఇంటిలోనైనా ఈనాడు జరుగుతున్న మొదటి పని కాఫీ. అది లేకపోతే మిగిలిన ఏ పని చేయడానికి మనసు రాదు. లేచీ లేవగానే చక్కటి కాఫీ గొంతు దిగితే అప్పుడు మెదడు పనిచేయడం ప్రారంభిస్తుంది గృహిణి లేవగానే ఆ పని మొదలు పెట్టే ప్రయత్నంలో ఉంటుంది అప్పటికే పెద్దవారైన అత్త, మామ ముందుగా లేచి అత్త కేక వేస్తుంది ఏమే మావయ్య గారికి కాఫీ తాగందే ఏమి తోచదమ్మ కొంచెం త్వరగా తయారై కొంచెం కాఫీ పెట్టరాదూ అంటూ గృహిణికి కేకలు వినపడుతాయి. తాను ముందు స్నాన సంధ్యలు చేయకుండా ఏ పని చేయడానికి మనస్కరించదు. మరి ఒక్క నిమిషం ఆలస్యమైనా గాని మిగిలిన వారు ఉపేక్షించలేరు. నిజానికి ఇది జటిలమైన సమస్య వీటిలో ఏ ఒక్కరిని తప్పు పట్టడానికి వీలు లేదు కారణం అది అలవాటైన విషయం అది తప్పని అలవాటు.
కాఫీ కలపడానికి వెళ్ళిన గృహిణికి మొదట ఎదురయ్యే ప్రశ్న ఎవరికి కాఫీ ఎలా కలపాలి. అత్తమామలో మధుమేహ వ్యాధిగ్రస్తులు వారికి పంచదార వేయకూడదు మామయ్య గారు మామూలుగా తాగేస్తారు తప్ప అత్తయ్య గారు మాత్రం కొంచెం ఉడుకుతుంది. చూడమ్మా ఇది కాషాయంగా చేదుగా ఉంది తాగలేక చచ్చిపోతున్నాను కొంచెం పంచదార వేయరాదూ అని ఎంతో నమ్రతగా అడిగినట్లుగా నటిస్తుంది కనుక సక్రిన్ (saccharin) తీసుకొచ్చి కలిపి పంచదార అన్నట్లుగా ఆమెకు భ్రమను కల్పిస్తూ ఆమెకు కాఫీ ఇస్తుంది. తన భర్తకు అటు ఎక్కువ కాకూడదు ఇటు తక్కువ కాకుండా సరిపడా వేయాలి ఆయనకి ఎలా ఉంటే సరిపోతుందో ఈవిడకి ముందే ఎలా తెలుస్తుంది రెండు మూడు సార్లు అనుభవం అయిన తర్వాత కదా విషయం తెలిసేది.
ఇంక పిల్లల విషయానికొస్తే చిన్ను అసలు పేరు సాయి వేమన్ చిన్నపిల్ల హనీ అసలు పేరు కార్తీకా మరి ఆడపిల్ల అంటే గృహిణికి కొంచెం ఇష్టం ఎక్కువ ఉంటుంది కదా. అందుకని కొంచెం పంచదార ఎక్కువ వేసి కలిపితే చిన్ను అదేమిటి చెల్లికి అలా కలిపి నాకు ఇలా కలిపావు అని పేచి. సరే కాఫీ వద్దు లేరా పాలు తాగు అని అంటే నేనేమైనా చంటి వాడిని అనుకుంటున్నావా పాలు తాగే వయసేనా నాది అని ఎదురు పోట్లాడడం వారిద్దరూ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఒకరినొకరు కొట్టుకుని తిట్టుకొని హాయిగా ఆనందిస్తూ ఉంటారు కానీ ఎవరైనా బయట వారు కానీ వారి అమ్మానాన్న కానీ ఏమైనా అంటే వాళ్ళు ఇద్దరు ఒకటై పోతారు ఇలాంటివి ప్రతి కుటుంబంలో అందరికీ అనుభవంలోకి వచ్చే విషయాలే అయితే దానిని అక్షర రూపంలో పెడితే దాని ప్రభావం వేరుగా ఉంటుందని ఈ ప్రయత్నం చేస్తున్నాను మరి ఇది చదివిన తరువాత అయినా గృహిణికి సామూహిక గౌరవం ఇస్తారని ఆశిస్తున్నాను.... ఇస్తారు కదా మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి